Bill Gates: సెక్స్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న సంబంధాలపై మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ తన సంస్థ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. ఎటువంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదని చెబుతూనే, ఇద్దరు రష్యన్‌ యువతులతో తనకు సంబంధాలున్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే, ఆ యువతులు ఎప్‌స్టీన్‌ కుంభకోణంలో బాధితులు కాదని స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో మహిళలతో తన ఫొటోలు విడుదల కావడంపై స్పందిస్తూ, అవి ఎప్‌స్టీన్‌ అడిగిన మేరకు దిగినవేనని వివరించారు.

‘ఎప్‌స్టీన్‌ బాధితులతో లేదా ఆయన చుట్టూ తిరిగే మహిళలతో నాకు ఎలాంటి సంబంధాలూ లేవు. ఆయన్ను కలవడం, గేట్స్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌లను ఆయన సమావేశాలకు తీసుకెళ్లడం పెద్ద తప్పిదమే. ఈ వ్యవహారంలో నా తప్పు కారణంగా చిక్కుకున్న ప్రతి ఒక్కరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను’ అని మంగళవారం సిబ్బందితో జరిగిన సమావేశంలో బిల్‌ గేట్స్‌ అన్నారు. ఈ సమావేశంలో ఆయన తన తప్పును బహిరంగంగా అంగీకరించడం గమనార్హం.

Tags: