Jeffries: రక్షణ కార్యదర్శిపై అభిశంసన దిశగా డెమోక్రాట్లు.. జెఫ్రీస్ కీలక వ్యాఖ్యలు
జెఫ్రీస్ కీలక వ్యాఖ్యలు
Jeffries: అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్‌పై ఇంపీచ్మెంట్ తీర్మానానికి హౌస్ డెమొక్రటిక్ లీడర్ హకీమ్ జెఫ్రీస్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆదివారం ఏబీసీ ‘దిస్ వీక్’ కార్యక్రమంలో మాట్లాడుతూ “నేను హెగ్సెత్ రిజల్యూషన్‌పై హార్డ్ యెస్” అని స్పష్టం చేశారు.
“సో-కాల్డ్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. జాతీయ భద్రతను దెబ్బతీశారు. ఇరాన్లో ఈ నిర్లక్ష్య, ఖరీదైన యుద్ధాన్ని రూపొందించారు. దీని వల్ల అమెరికన్ ప్రజలపై ధరలు ఆకాశాన్నంటాయి. దేశం మరింత అసురక్షితంగా మారింది. పీట్ హెగ్సెత్ వెళ్లాల్సిందే” అని జెఫ్రీస్ అన్నారు.
మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమొక్రట్లు హౌస్, సెనేట్ రెండింటిలోనూ విజయం సాధించిన తర్వాత మొదటిసారి మంగళవారం వాషింగ్టన్లో సమావేశమయ్యే సమయంలో ఈ తీర్మానంపై చర్చిస్తామని ఆయన తెలిపారు. ఈ తీర్మానానికి బలమైన మద్దతు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కెంటుకీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు థామస్ మాస్సీ ఇప్పటికే హెగ్సెత్‌పై ఎనిమిది ఆర్టికల్స్‌తో ఇంపీచ్మెంట్ తీర్మానం సిద్ధం చేశారు. ఆయన ఈ వారం దాన్ని మళ్లీ ప్రవేశపెట్టనున్నారు. ఇరాన్ యుద్ధాన్ని కాంగ్రెస్ అనుమతి లేకుండా నడిపించారని, వార్ పవర్స్ రిజల్యూషన్‌ను ఉల్లంఘించారని మాస్సీ ఆరోపణలు చేశారు.
మిడ్టర్మ్లలో రిపబ్లికన్లు ఓటమి పాలైన నేపథ్యంలో హెగ్సెత్‌పై ఒత్తిడి పెరిగింది. జెఫ్రీస్ త్వరలోనే హౌస్ స్పీకర్ కావచ్చని అంచనా.