JD Vance: ఇరాన్‌ మాతో ఆడుకోవద్దు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ గట్టి హెచ్చరిక!

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ గట్టి హెచ్చరిక!

Update: 2026-04-10 15:54 GMT

JD Vance: అమెరికా-ఇరాన్‌ మధ్య పాకిస్థాన్‌ వేదికగా జరగబోయే శాంతి చర్చలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ కీలక చర్చల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

“మేము చర్చల కోసం ఎదురుచూస్తున్నాం. అవి సానుకూలంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం. ఇరాన్‌ నేతలు చిత్తశుద్ధితో చర్చలకు వస్తే మేము పూర్తి సహకారం అందిస్తాం. కానీ, మాతో ఆడుకోవాలని చూస్తే.. మా బృందం కూడా అదే రీతిలో వ్యవహరిస్తుందని వారు తెలుసుకోవాలి” అని జేడీ వాన్స్‌ హెచ్చరించారు.

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభాన్ని ముగించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది కీలక పరిణామం. ఇస్లామాబాద్‌లో మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అమెరికా బృందం కూడా త్వరలో రానుంది. ఇరు దేశాల ప్రతినిధులు ప్రత్యక్షంగా చర్చలు జరిపి సంక్షోభానికి పరిష్కారం కనుగొనాలని ఆశిస్తున్నారు.

ఈ చర్చల ఫలితాలపై అంతర్జాతీయంగా భారీ ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News