Epstein Files Trigger Sensation: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలనం: బిల్ గేట్స్‌కు సుఖవ్యాధి.. రష్యన్ మహిళలతో సంబంధాలు?

రష్యన్ మహిళలతో సంబంధాలు?

Update: 2026-01-31 06:25 GMT

Epstein Files Trigger Sensation: అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తు ఫైల్స్ (Epstein files) ప్రపంచవ్యాప్తంగా హల్‌చల్ చేస్తున్నాయి. దాదాపు 30 లక్షల పేజీల ఈ డాక్యుమెంట్లలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates)కు సంబంధించిన షాకింగ్ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గేట్స్ రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారని, దీంతో సుఖవ్యాధులకు గురయ్యారని ఎప్‌స్టీన్ ఆరోపించినట్లు ఈ ఫైల్స్‌లో ఉంది. ఈ విషయాలు మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతున్నాయి.

2013లో ఎప్‌స్టీన్ తనకు తాను రాసుకున్న ఈ-మెయిల్‌లో ఈ ఆరోపణలు చేశాడు. గేట్స్ రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు నెరిపి సుఖవ్యాధుల బారిన పడ్డారని పేర్కొన్నాడు. ఈ సమస్య బయటపడకుండా ఉండేందుకు, తన భార్య మెలిందా (Melinda Gates)కు రహస్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలని గేట్స్ తనను అడిగారని ఎప్‌స్టీన్ వెల్లడించాడు. అదే మెయిల్‌లో, ఆ తర్వాత గేట్స్ తనతో ఆరేళ్ల స్నేహాన్ని తెంచుకున్నారని కూడా ప్రస్తావించాడు. అయితే, ఈ ఆరోపణలను గేట్స్ టీమ్ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా అసత్యమైనవి, నిరాధారమైనవని గేట్స్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. స్నేహం తెంచుకోవడం వల్లే ఎప్‌స్టీన్ ఇలాంటి మిథ్యా ప్రచారం చేశాడని వారు పేర్కొన్నారు.

మస్క్‌కు ఎప్‌స్టీన్ ఆహ్వానం

ఈ తాజా ఫైల్స్‌లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు సంబంధించిన వివరాలు కూడా బయటపడ్డాయి. యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లోని తన ప్రైవేట్ ద్వీపాన్ని సందర్శించాలని ఎప్‌స్టీన్ మస్క్‌కు ఈ-మెయిల్ ద్వారా పలుమార్లు ఆహ్వానాలు పంపాడు. అయితే, టెస్లా సీఈవో మస్క్ ఈ ఆహ్వానాలను పలుమార్లు తిరస్కరించినట్లు డాక్యుమెంట్లు సూచిస్తున్నాయి.

బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఎప్‌స్టీన్‌కు డిన్నర్ ఆహ్వానం

బ్రిటన్ రాజు చార్లెస్-3 సోదరుడు ప్రిన్స్ ఆండ్రూ పేరు మరోసారి ఈ ఫైల్స్‌లో ప్రస్తావనకు వచ్చింది. 2010లో ఆండ్రూ ఎప్‌స్టీన్‌ను బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో డిన్నర్‌కు ఆహ్వానించినట్లు ఈ-మెయిల్ సంభాషణలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఎప్‌స్టీన్ అక్కడికి వెళ్లారా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు.

ఈ ఫైల్స్ విడుదలతో ఎప్‌స్టీన్ కుంభకోణం మరిన్ని కోణాలు బయటపడుతున్నాయి.

Tags:    

Similar News