Former President Joe Biden: మాజీ అధ్యక్షుడు జో బైడెన్: జో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్.... రేడియేషన్ థెరపీ పూర్తి
రేడియేషన్ థెరపీ పూర్తి
Former President Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన ప్రతినిధి ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించారు. ఫిలడెల్ఫియాలోని పెన్ మెడిసిన్ రేడియేషన్ ఆంకాలజీ కేంద్రంలో బైడెన్ చికిత్స పొందుతున్నారు.
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన 82 ఏళ్ల బైడెన్, ఈ ఏడాది జనవరిలో తన అధ్యక్ష పదవీకాలాన్ని ముగించారు. మే నెలలో ఆయనకు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్యాన్సర్ ఎముకలకు కూడా వ్యాపించినట్లు వైద్యులు గుర్తించారు. మూత్ర సంబంధిత సమస్యలు బయటపడటంతో పరీక్షలు చేయగా, క్యాన్సర్ బయటపడింది.
ప్రొస్టేట్ క్యాన్సర్ తీవ్రతను గ్లీసన్ స్కోర్ ద్వారా అంచనా వేస్తారు. ఇది 6 నుంచి 10 మధ్య ఉంటుంది. బైడెన్ స్కోరు 9గా నమోదైంది, ఇది తీవ్రమైన స్థాయిని సూచిస్తుంది. ఇటీవల గత నెలలో బైడెన్ నుదుటిపై చర్మ క్యాన్సర్ కణాలను తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చికిత్స పూర్తి కావడంతో ఆయన పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.