Fresh US Strikes: హర్మూజ్ సమీపంలో అమెరికా తాజా దాడులు
అమెరికా తాజా దాడులు
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ సైనిక స్థావరంపై యూఎస్ దాడి
ఇరాన్ డ్రోన్ దాడిని అడ్డుకున్న అమెరికా.. ఆత్మరక్షణ చర్యగా ప్రకటన
Fresh US Strikes: అమెరికా మరోసారి ఇరాన్‌పై తాజా సైనిక దాడికి దిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఒక ఇరాన్ సైనిక స్థావరాన్ని యూఎస్ దళాలు లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి.
ఈ దాడి హర్మూజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రవాణాకు ముప్పు కలిగించే ఇరాన్ బలగాలను ఎదుర్కోవడానికి భాగంగా చేపట్టినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ నాలుగు డ్రోన్లను అమెరికా వాణిజ్య నౌక వైపు ప్రయోగించగా, యూఎస్ దళాలు వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ఆ తర్వాత ముందస్తుగా చర్య తీసుకుంటూ ఇరాన్ సైనిక స్థావరంపై దాడి చేశారు.
ఈ చర్యలు పూర్తిగా ఆత్మరక్షణ ఉద్దేశ్యంతోనే చేపట్టినట్లు యూఎస్ వర్గాలు పేర్కొన్నాయి. దాడిలో ప్రాణనష్టం జరిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఇరాన్ తీవ్ర ఆగ్రహం:
హర్మూజ్ ప్రాంతంలో అమెరికా పదే పదే దాడులు చేయడంపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది.
ఇదే సమయంలో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవు సమీపంలో మూడు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ పేలుళ్ల కారణం ఇంకా తెలియరాలేదు.