Trending News

భారత్ లో గ్రీన్ అమ్మోనియా ప్లాంటు

World Hydrogen Summit in Netherlands

Update: 2025-05-26 08:28 GMT

ఆంధ్రప్రదేశ్ లో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు కానుంది. నెదర్లాండ్స్లో జరుగుతున్న ప్రపంచ హైడ్రోజన్ సమిట్ లో ఇందుకు సంబంధించి భారత్ కు చెందిన జునో జౌలె గ్రీన్ ఎనర్జీ ప్రై.లి. జర్మనీ ఎనర్జీ ట్రేడింగ్ కంపెనీ అనుబంధ సంస్థ సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఏటా మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా తయారు చేసేలా ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంస్థలు నిర్ణయించాయి.

ఇక్కడ ఎలక్ట్రోలసిస్ ద్వారా 180 వేల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ కూడా ఉత్పత్తి కానుంది. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో అభివృద్ధి చేస్తారు. ఇందుకు మొత్తం 1.3 బిలియన్ డాలర్ల (రూ.10 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నారు. సముద్ర నీటిని మంచి నీరుగా మార్చే ప్లాంట్నూ ఇందులోనే ఏర్పాటు చేస్తారు. ఈ ఎంఓయూపై జేజే గ్రీన్ ఎనర్జీ సంస్థ సీఈఓ రాయపాటి నాగ శరత్, సెలెక్ట్ న్యూ ఎనర్జీస్ జీఎంబీహెచ్ ఎండీ ఫెలిక్స్ డేంజర్లు సంతకాలు చేశారు. కోస్తాతీరంలోని మూలపేట ఓడరేవు సమీపంలో ఏర్పాటు చేసే ఈ ప్లాంటు ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మేలు జరుగనుంది.

Tags:    

Similar News