నాటు నాటు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంది - మిస్ జపాన్
భారతీయ సినిమాలపై తనకు ఎంతో ఆసక్తి ఉందని నాటు నాటు పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు చేసిన డ్యాన్స్ అమోఘమని మిస్ జపాన్ కియానా టోమిటా చెప్పారు. ఆ డాన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించానని, అయితే, కష్టంగా అనిపించిందని అన్నారు. తన అభిమాన నటి ప్రియాంక చోప్రా అని, హీరో ఉన్నారని, అయితే ఆయన పేరు మర్చిపోయానని చెప్పారు. ఇప్పుడు ఇండియన్ సినిమాలు జపనీస్‌లో రిలీజ్ అవుతున్నాయని, తన ల్యాప్‌టాప్‌లో వాటి లిస్ట్ ఉందని, అన్ని సినిమాలు చూడాలని ఉందని మిస్ జపాన్ చెప్పారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు జపాన్ నుంచి కియానా టోమిటా వచ్చారు. పొలిటెంట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బౌద్ధ మత సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జపాన్ నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానన్నారు. హైదరాబాద్‌కి రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
భారత్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఇండియన్ కర్రీ అని చెప్పిన కియానా, బటర్ చికెన్ కర్రీ తనకు ఎంతో ఇష్టమన్నారు. ఇది తన టాప్ 3 ఫేవరెట్ ఫుడ్స్‌లో ఒకటని, వెల్లడించారు. ప్రియాంక చోప్రా, సుష్మితా సేన్ వంటి మిస్ వరల్డ్ విజేతలతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను కలవాలని ఉందని, వారు తనకు.. నాటు నాటు డాన్స్ నేర్పితే ఎంతో సంతోషంగా ఉంటుందని ఉత్సాహంగా చెప్పారు.
తనకు ఫ్యూచర్‌లో జర్నలిస్టు అవాలని ఉందని మనసులో మాటను వెల్లడించారు.