Iran: అమెరికాకు షాక్ ఇచ్చిన ఇరాన్ – మరో F-35 కూల్చివేత
మరో F-35 కూల్చివేత
Iran: అమెరికా వాయుసేనకు చెందిన అత్యాధునిక F-35 ఫైటర్ జెట్‌ను తమ ఆకాశంలో కూల్చేశామని ఇరాన్ సైన్యం తాజాగా ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇరాన్ చేతిలో కూలిన F-35 యుద్ధ విమానాల సంఖ్య రెండకు చేరింది.
ఇరాన్ విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఘటనలో పైలట్ గాయపడ్డాడని, అతని బతికి ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే, ఇరాన్ చేసిన ఈ ఆరోపణలపై అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) నుంచి ఇంతవరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
ఇరాన్ చేసిన ఈ ప్రకటన నిజమైతే అమెరికాకు ఇది తీవ్ర నష్టం అని భావిస్తున్నారు. అమెరికా తన అత్యంత ప్రతిష్ఠాత్మక యుద్ధ విమానాల్లో ఒకటైన F-35 లైటనింగ్-2 ఇప్పటివరకు శత్రు దేశాల చేతుల్లో దాడికి గురికావడం ఇదే మొదటిసారి. అమెరికా మరియు దాని మిత్ర దేశాల వాయుసేనలకు వెన్నెముకలాంటి ఈ స్టెల్త్ జెట్ ఖరీదు సుమారు 10 కోట్ల డాలర్లు. ప్రస్తుతం 19 దేశాలు ఈ విమానాలను తమ సైన్యంలో ఉపయోగిస్తున్నాయి.
అధునాతన స్టెల్త్ సాంకేతికత, సెన్సర్ సమన్వయం మరియు నెట్‌వర్కింగ్ సామర్థ్యాలతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఐదో తరం యుద్ధ విమానం ఇది. ఈ ఘటన ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.