Iran: ఇరాన్ కృతజ్ఞత: భారత్ స్నేహాన్ని ఎప్పటికీ మరచిపోమని హృదయపూర్వక సందేశం

హృదయపూర్వక సందేశం

Update: 2026-07-06 14:06 GMT

Iran: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత్ ప్రతినిధి బృందానికి దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ దుఃఖ సమయంలో భారత్ తమ ప్రజల పక్కన నిలిచి, సానుభూతి ప్రకటించడాన్ని ఎప్పటికీ మరచిపోలేమని ఇరాన్ పేర్కొంది.

ఇరాన్ రాయబార కార్యాలయం వ్యక్తం చేసిన సందేశంలో, ఈ చర్య ఇరు దేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహం, బలమైన అనుబంధానికి ప్రతీకమని, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఇరాన్ ప్రజలు భారత్‌తో ఉన్న ఈ గాఢమైన బంధాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని స్పష్టం చేసింది.

ఖమేనీ అంత్యక్రియలు శుక్రవారం టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ప్రారంభమయ్యాయి. ఆయన భౌతికకాయానికి దేశ-విదేశాల నుంచి అధికారులు, ప్రతినిధులు శ్రద్ధాంజలి అర్పించారు. భారత్ తరఫున బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు సిక్కు, హిందూ, ముస్లిం, క్రైస్తవ మత ప్రముఖులు హాజరయ్యారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం మషహద్‌లో జులై 9న ఖననం చేయనున్నారు.

ఈ సందర్భంగా భారత్ చూపిన సానుభూతి ఇరు దేశాల మధ్య ద్విపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News