హర్మూజ్ దాడులకు తీవ్ర స్పందన.. గల్ఫ్‌లోని అమెరికా బేసులు లక్ష్యం

Iran Launches Massive Retaliatory Strikes: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ఉధృతమయ్యాయి. హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా చేపట్టిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ అమెరికా సైనిక బేసులపై క్షిపణి దాడులు చేసింది.

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ఈ దాడులకు బాధ్యత వహించింది. హర్మూజ్ సమీపంలో అమెరికా దళాలు ఇరాన్ స్థావరాలపై దాడులు చేసిన కొద్ది గంటల్లోనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు IRGC తెలిపింది.

బందర్ అబ్బాస్ పోర్టు ప్రాంతంలో బలమైన పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ దాడులను అమెరికా యొక్క "దురాక్రమణ"గా అభివర్ణించిన ఇరాన్, శాంతి చర్చలు జరుగుతున్న వేళ అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. ఇలాంటి దాడులు కొనసాగితే తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొనవలసి ఉంటుందని హెచ్చరించింది.

ఈ దాడుల్లో క్షిపణులు, డ్రోన్లు కువైట్ గగనతలం గుండా వెళ్తున్నట్లు ఆ దేశ సైనిక అధికారులు పేర్కొన్నారు. అయితే వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ వెల్లడించింది.

ప్రస్తుతం ప్రాంతంలో ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి.

Tags: