Iran’s Shocking Bill: ట్రంప్, నెతన్యాహులను హత్య చేస్తే రూ. 560 కోట్ల బహుమతి! ఇరాన్ సంచలన బిల్లు
ఇరాన్ సంచలన బిల్లు
పార్లమెంట్‌లో త్వరలో ఓటింగ్
Iran’s Shocking Bill: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు లను హతమార్చిన వ్యక్తి లేదా సంస్థకు రూ. 560 కోట్ల (58 మిలియన్ డాలర్లు) బహుమతి ప్రకటించాలని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఛైర్మన్ ఇబ్రహీమ్ అజీజ్ వెల్లడించారు.
‘ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య’ అనే పేరుతో సిద్ధం చేస్తున్న ఈ బిల్లు ప్రకారం, ట్రంప్-నెతన్యాహు లను హత్య చేసే ఎవరికైనా లేదా ఏ సంస్థకైనా ఈ భారీ మొత్తాన్ని అధికారికంగా చెల్లించాలని ప్రతిపాదించారు. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్‌లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది.
ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గతేడాది ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, తనపై హత్యాయత్నం జరిగితే అమెరికా ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తుందని హెచ్చరించిన విషయం తాజా పరిణామాల్లో మరోసారి స్మరణీయమవుతోంది.
ఈ పరిణామాలు మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి ప్రయత్నాలకు తీవ్రమైన ఎదురుదెబ్బనిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ ఈ బిల్లును ఆమోదించినట్లయితే, అంతర్జాతీయ సంబంధాలు మరింత క్లిష్టమయ్యే అవకాశం ఉంది.