బిగ్ బ్యూటీఫుల్ బిల్లే కొంప ముంచిందా...?
ముగిసిన ట్రంప్, మస్క్ బంధం?;
- DOGE టీమ్ స్పెషల్ అడ్వైజర్ పదవికి రాజీనామా
- తన పదవీ కాలం ముగిసిందంటూ ఎక్స్ లో ట్వీట్
- మస్క్ ను తొలగించాలని నిర్ణయించిన సీనియర్ స్టాఫ్
- కొంపముంచిన మస్క్ సీబీఎస్ మీడియా ఇంటర్వ్యూ
- 24 గంటలు గడవక ముందే తప్పుకున్న మస్క్
- బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ వివాదాస్పద కామెంట్లు
- అది ఖర్చుతో కూడుకున్నదని పెదవి విరుపు
- DOGE టీమ్ పడిన శ్రమ వృథా అవుతుందని వ్యాఖ్య
- బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఇమ్మిగ్రంట్లపై కఠిన ఆంక్షలు
- బిల్లు అమలయితే మస్క్ కూడా ఇమ్మిగ్రంట్ పరిధిలోకి
- వన్ ట్రిలియన్ డాలర్ల టార్గెట్ రీచ్ కాని DOGE టీమ్
బిలియనీర్ ఎలన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య బంధం ముగిసిపోయింది. ట్రంప్ ప్రభుత్వానికి ఖర్చులు తగ్గించే బోర్డుకు అడ్వైజర్ గా కొనసాగుతున్న మస్క్ ట్రంప్ కొత్తగా ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను వ్యతిరేకిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల అనంతరం ఆయన DOGE టీమ్ స్పెషల్ అడ్వైజర్ పదవి నుంచి తప్పుకున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన ఆ బిల్లు చాలా ఖర్చుతో కూడుకున్నదని, దానివల్ల తాను ఇన్నాళ్లు శ్రమపడి చేసిన పొదుపు అంతా నీరు కారిపోతోందని మస్క్ అభిప్రాయపడ్డారు. అయితే తన రాజీనామాకు కారణం ఇదేనని బయటకు వెల్లడించనప్పటికీ DOGE సంస్థకు స్పెషల్ అడ్వైజర్ గా తన పదవీ కాలం ముగిసినందున తాను తప్పుకున్నట్లు, ఇన్నాళ్లు సేవ చేసేందుకు తనకు అవకాశమిచ్చిన ట్రంప్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎక్స్ లో ట్వీట్ చేశారు. భవిష్యత్తులో DOGE సంస్థ మరింత బలపడాలని అది మరింతగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుందని కామెంట్ చేశారు.
సీనియర్ స్థాయి అధికారి నిర్ణయం
ఈవార్తలను వైట్ హౌస్ వర్గాలు థృవీకరించాయి. మస్క్ ను సాగనంపే ప్రక్రియ ఒక సీనియర్ అధికార సిబ్బంది స్థాయిలో నిర్ణయమైందని, మస్క్ ట్రంప్ ను నేరుగా కలిసినది లేదని బయటకు వస్తున్న సమాచారం.
ఇంటర్వ్యూ తెచ్చిన తంటా..
సిబీఎస్ మీడియా ఛానెల్ కు మస్క్ ఇచ్చిన పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ప్రసారమైన 24 గంటలు గడవక ముందే మస్క్ భవితవ్యం నిర్ణయమైపోయింది. ఈ ఇంటర్వ్యూలోనే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ను మస్క్ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమలు చేస్తే ఇప్పటి వరకూ చేసిన పొదుపు ప్రక్రియ కాస్ట్ కటింగ్ శ్రమ అంతా వృథా అవుతుందని అందులో మస్క్ కుండ బద్దలు కొట్టారు.అయితే ఇప్పటికే ఈ బిల్లును సెనేట్ పరిశీలనకు పంపారు కూడా. ఈ బిల్లులో మరిన్ని పన్ను కోతలు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉన్నాయి. అంతేకాక ఈ బిల్లు శుద్ధమైన ఇంధన తయారీ ప్రతిపాదనలు పక్కన పెట్టడమే కాక, సామాజిక స్పృహను కలుగ చేసే కార్యక్రమాలైన మెడికెయిడ్ లాంటి వాటికి కేటాయించిన నిధుల్లో కోతను కూడా సూచిస్తోంది. ఇది ద్రవ్య లోటు పెరగడానికే దోహదపడుతుంది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు పెద్దదేకావచ్చు.అందంగానే ఉండొచ్చు ఆరెండూ కలగలిసి కూడా కావొచ్చునంటూ మస్క్ తన ఇంటర్వ్యూలో ఆ బిల్లుపై కామెంట్ చేశారు. ఈబిల్లు చాలా ఖర్చుతో కూడిన ప్రణాళిక, పైగా ఇప్పటి వరకూ అనవసర ఖర్చును నివారించడానికి DOGE సంస్థ చేసిన ప్రయత్నం, దాని ద్వారా సమకూరిన ఆదాయం అంతా వృథా అయిపోతుంది. ఇది DOGE టీమ్ చేసిన పనిని తక్కువ చేయడమే అవుతుందని మస్క్ అన్నారు.మస్క్ చేసిన ఈవ్యాఖ్యలు రిపబ్లికన్లు కూడా సమర్ధించారు. మస్క్ శ్రమను తక్కువ చేయడమేనని కొందరు సెనెటర్లు కామెంట్ చేశారు.
ట్రిలియన్ డాలర్ల పొదుపు టార్గెట్
DOGE టీమ్ ఈ పొదుపు చర్యల ద్వారా ఒకట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి అందించాలన్నది టార్కెట్. అయితే మస్క్ టీమ్ దీనిని పూర్తి చేయలేకపోయింది.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమలయితే మస్క్ కూడా ఇమ్మిగ్రంటే అవుతారు. కాబట్టి ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు ఆయనకు కూడా వర్తిస్తాయి. బహుశా అందుకే మస్క్ తప్పుకున్నారా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి.