మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?
- రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం
- నిరంతర దాడులతో వేడెక్కిన ప్రపంచ రాజకీయం
- శాంతి చర్చలను అవమానించారంటూ ట్రంప్ ఆగ్రహం
- పుతిన్ కు పిచ్చి పట్టిందని మండిపాటు
- దీంట్లో నాటో, పశ్చిమ దేశాల జోక్యం ఉండరాదన్న రష్యా
- మూడో ప్రపంచ యుద్ధం కోరుకుంటున్నారా అన్న యూరప్
- తానే లేకపోతే రష్యాకు కోలుకోలేని దెబ్బ అన్నట్రంప్
- ట్రంప్ మరీ ఎమోషనల్ అవుతున్నారన్న ఉక్రెయిన్
- ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నరష్యా సేనలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ రాజకీయాలను మార్చేస్తోంది. శాంతి చర్చల పేరుతో తన జోక్యాన్ని రష్యా అపహాస్యం చేస్తోందని, చర్చలకు రాకుండా దాడులు కొనసాగిస్తోందని ట్రంప్ ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. అయితే మాస్కో మాత్రం నాటో, పశ్చిమ దేశాలు సోవియట్ దేశాల వ్యవహారాల్లో వేలు పెట్టకూడదని మంకు పట్టుపడుతోంది. పుతిన్ కామెంట్లపై మూడో ప్రపంచ యుద్ధం కోరుకుంటున్నట్లుగా ఉందని పశ్చిమ దేశాలు కామెంట్ చేస్తున్నాయి. మొత్తం వ్యవహారం చూస్తుంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగదని అర్దమవుతోంది.
ట్రంప్ అసహనం.. పుతిన్ పై విమర్శలు
తాజా పరిణమాల నేపధ్యంలో రష్యా తీరుపై ట్రంప్ మండి పడుతున్నారు. శాంతి చర్చల విషయంలో ఉక్రెయిన్ నే కాదు మమ్మల్ని పుతిన్ మోసగిస్తున్నారు,దెబ్బ కొడుతున్నారంటూ మండిపడ్డారు.శాంతి చర్చలకు రాకుండా డిలే చేస్తూ కీవ్ పై దాడులను ఉథృతం చేయడం చూస్తుంటే కావాలనే దాగుడు మూతలు ఆడుతున్నారని స్పష్టమవుతోందన్నారు.పుతిన్ నిప్పుతో చెలగాటమాడుతున్నారని అమెరికా అడ్డు లేకపోతే రష్యాకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు.పుతిన్ కు పిచ్చిపట్టినట్టుందని కామెంట్ చేశారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఉక్రెయిన్ భావోద్వేగంతో చేసిన స్పందనగా ఉక్రెయిన్ అభివర్ణించింది. ఎవరెన్ని చెప్పినా పాత సోవియట్ దేశాలపై పాశ్చాత్య దేశాలు వేలు పెట్టడం మానేస్తేనే ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందని మాస్కో ప్రకటించింది.దీనిపై యూరోప్ దేశాధినేత ఒకరు మూడో ప్రపంచ యుద్ధం రావాలని పుతిన్ కోరుకుంటున్నారంటూ కామెంట్ చేశారు.
మంచికోరే ఆగుతున్నాం !!
రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇంత జరిగినప్పటికీ రష్యాపై తాను తాజాగా ఆంక్షలు విధించబోవడం లేదని అది శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తుందన్న ఉద్దేశంతో ఆగుతున్నానని ట్రంప్ అన్నారు.మరోవైపు ఇస్తాన్ బుల్ లో జూన్ 2న జరగాల్సిన శాంతి చర్చలను తాత్కాలికంగా ఆపుచేసినట్లు రష్యా ప్రకటించింది. అయితే దీనిపై కీవ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.మూడేళ్లనుంచి నిరంతరంగా సాగుతున్న ఈయుద్ధం కొలిక్కి వచ్చే మార్గం కనిపించడం లేదు.పైగా ఈ మధ్య కాలంలో రెండు దేశాల మధ్య ఘర్షణలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. మిస్సైల్స్, ద్రోణ్ దాడులతో రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతుంటే ఉక్రెయిన్ కూడా అంతే దీటుగా బదులిస్తోంది. యుద్ధవిరమణకు శాంతి చర్చలకు ఒక అవగాహనా ఒప్పందాన్నితయారు చేస్తామని ట్రంప్ అంటున్నారు. అయితే జూన్ రెండు నాటి చర్చలకు ఉక్రెయిన్ అధికారికంగా అంగీకరించలేదు.ఉక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తెం ఉమరోవ్ యుద్ధ విరమణ అంగీకారానికి తమ షరతులతో కూడిన డాక్యుమెంట్ ను అమెరికాకు అందించారు. అదే టైమ్ లో రష్యా కూడా తమ డిమాండ్లను ఒక పత్రంపై ముందుపెట్టాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది.రష్యాతో చర్చలకు తాము అంగీకరిస్తూనే మెమోరాండం అన్నది లేకుండా ఎన్ని చర్చలు జరిపినా అది వృథాయేనని ఉమరోవ్ అంటున్నారు. అయితే చర్చలకు సంబంధించి తమషరతుల విషయమై అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రుబియోతో చర్చించినట్లు తెలిపారు. కానీ ఆ వివరాలేవీ వెల్లడించలేదు.
ఆక్రమణలు చేయబోమని రాసి ఇవ్వండి
యుద్ధ విరమణకు పుతిన్ కొన్ని షరతులు పెడుతున్నారు. నాటో దేశాలు రష్యా తూర్పు వైపు మరింత ఆక్రమించకుండా ఉంటామని లిఖితపూర్వక ప్రమాణం చేస్తేనే యుద్ధం ఆగుతుందని,అలాగే తమపై విధించిన ఆంక్షలు కొన్నింటిని సడలించాల్సి ఉందని రష్యా షరతులు పెడుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి
పెరుగుతున్న యుద్ధం !!
ఉక్రెయిన్ కు చెందిన 296 డ్రోన్లను, మిస్సైళ్లను కూల్చేసినట్లు రష్యా ప్రకటించగా, రష్యా ఆయుధ స్థావరాలపై తాము దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించుకుంది.రష్యా 88 డ్రోన్లను, ఐదు బాలిస్టిక్ క్షిపణులను తమపై గురిపెట్టిందని ఉక్రెయిన్ వెల్లడించింది.కర్క్స్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలను వెనక్కు మళ్లేలా రష్యా ఒత్తిడి పెంచడంతో పాటు, ఈశాన్య ఉక్రెయిన్ లోని పలు గ్రామాలను కూడా రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి.అయితే రష్యా తూర్పు ఉక్రెయిన్ లోని సుమీ ప్రాంతంలో రష్యా 50 వలే సాయుధ బలగాలు దింపిందని అయితే ఎలాంటి ఆక్రమణలకు పాల్పడకుండా తాము నిరోధించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తెలిపారు.రష్యా మూడేళ్లుగా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ లోని అయిదో వంతు భాగాన్ని మాత్రమే తమ స్వాధీనం లోకి తీసుకోగలిగింది. గత ఏడాది నుంచి యుద్ధం తీవ్రతరం చేసినా రష్యా, ఉక్రెయిన్ లకు యుద్ధం చుక్కలు చూపిస్తోంది. రెండు వైపులా భారీగా ఆస్తి, మిలటరీ,ప్రాణ నష్టం జరుగుతోంది.