Israeli Prime Minister Benjamin Netanyahu: ట్రంప్‌తో కొన్నిసార్లు విభేదాలు ఉంటాయి.. ఇజ్రాయెల్‌ సొంత ప్రయోజనాలే మా లక్ష్యం

ఇజ్రాయెల్‌ సొంత ప్రయోజనాలే మా లక్ష్యం

Update: 2026-06-16 12:07 GMT

Israeli Prime Minister Benjamin Netanyahu: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయని అంగీకరించారు. ఓ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన ప్రశ్నకు స్పందిస్తూ నెతన్యాహు, “నాకు, ట్రంప్‌కు మధ్య కొన్నిసార్లు విభేదాలు వస్తుంటాయి. అమెరికాతో సంబంధాల విషయంలో ఇజ్రాయెల్ తన సొంత ప్రయోజనాలకే కట్టుబడి ఉంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని ట్రంప్ కుదుర్చుకున్నారు. అది ఆయన నిర్ణయం. మాకు మా సొంత ప్రయోజనాలు ఉన్నాయి” అని స్పష్టం చేశారు.

ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటమే తన ప్రధాన లక్ష్యమని నెతన్యాహు పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నంత కాలం ఇది జరుగుతుందని, శాంతి ఒప్పందం ఉన్నా లేకున్నా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండదని ఆయన హామీ ఇచ్చారు.

ఇటీవలి సైనిక ఘర్షణల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, దాని సైనిక బలాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని నెతన్యాహు తెలిపారు. ఈ నష్టం వందల బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఘర్షణ ఇంకా పూర్తిగా ముగియలేదని హెచ్చరికలు చేశారు. ఇరాన్ తన మిత్రదేశాల నుంచి వచ్చే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యయానికి అదనంగా 350 బిలియన్ షెకెళ్లను (ఇజ్రాయెల్ కరెన్సీ) కేటాయించినట్లు నెతన్యాహు ప్రకటించారు.

Tags:    

Similar News