Marco Rubio: ట్రంప్‌ తరఫున పోప్‌ను కలిసిన రూబియో

పోప్‌ను కలిసిన రూబియో

Update: 2026-05-08 12:31 GMT

Marco Rubio: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్‌ నగరాన్ని సందర్శించారు. ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకించినందుకు పోప్‌ లియోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతికూల వ్యాఖ్యల నేపథ్యంలో చెడిన ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది.

రూబియో పోప్‌ లియోతోపాటు వాటికన్‌ నగర ఉన్నతస్థాయి దౌత్యవేత్తలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన, ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృత చర్చ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.

Tags:    

Similar News