US Strike Targets Chabahar: చాబహార్‌ను లక్ష్యంగా అమెరికా భారీ దాడి.. భారత్‌కు పెరిగిన ఆందోళన
భారత్‌కు పెరిగిన ఆందోళన
US Strike Targets Chabahar: ఇరాన్‌లోని వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా సైనిక దళాలు భారీ దాడులు చేశాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇది మొదటి సారి జరిగిన దాడి కావడం గమనార్హం. ఈ దాడుల్లో పోర్టు సిటీలో విద్యుత్ సరఫరా కూడా కొంత సమయం నిలిచిపోయింది.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ‘ప్రెస్ టీవీ’ ప్రకారం, అమెరికా దళాలు చాబహార్‌లోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దాడుల్లో కలంతారి పోర్టు మరియు మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దాడి అనంతరం తక్షణ సహాయక బృందాలు రెస్క్యూ చర్యలు చేపట్టాయి.
అమెరికా వర్గాలు ఈ దాడులు హార్మూజ్ సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసే సాధ్యమైన దాడులను అడ్డుకోవడానికి ఉద్దేశించినవని పేక్కొన్నాయి. చాబహార్ పోర్టు హార్మూజ్ జలసంధి బయట గల్ఫ్ ఆఫ్ ఒమన్‌కు సమీపంలో ఉంది. హిందూ మహాసముద్రం నుంచి ఇరాన్ సముద్ర వాణిజ్యానికి డీప్ వాటర్ పోర్టుగా ఇది ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చాబహార్ ఎంతో కీలకం. భారత్ పెట్టుబడులతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తోంది. అఫ్గానిస్థాన్, మధ్య ఆసియా దేశాలకు సరకులు రవాణా చేయడానికి భారత్ ఈ పోర్టును వాడుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో చాబహార్‌పై జరిగిన అమెరికా దాడి భారత్‌లో తీవ్ర ఆందోళనను కలిగించింది.