US President Donald Trump: మోదీ మంచి స్నేహితుడే.. అయినా భారత్‌పై ట్రంప్‌ తీవ్ర విమర్శలు

అయినా భారత్‌పై ట్రంప్‌ తీవ్ర విమర్శలు

Update: 2026-06-05 06:55 GMT

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని నరేంద్ర మోదీని మళ్లీ ప్రశంసించారు. ఆయనను తనకు చాలా ఇష్టమైన, గొప్ప స్నేహితుడని అభివర్ణించారు. అయితే, భారత్‌ సుంకాల విధానంపై ఆయన తన స్టైల్‌లో తీవ్ర విమర్శలు చేశారు.

వైట్‌ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్‌, “మోదీ అంటే నాకు బాగా ఇష్టం. ఆయన నా గొప్ప మిత్రుడు. మన మధ్య బలమైన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి” అని చెప్పారు.

అయితే వాణిజ్య చర్చలకు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా ఆయన భారత్‌పై విమర్శలు సంధించారు. “ఏళ్ల తరబడి భారత్‌ అమెరికాపై భారీ సుంకాలు విధించి లాభాలు పొందింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు భారత్‌ నుంచి మేము భారీ లాభాలు పొందుతున్నాం” అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

భారత్‌-అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధుల మధ్య నాలుగు రోజుల పాటు సాగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని వాణిజ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వస్తువుల వాణిజ్యం, కస్టమ్స్‌ విధానాలు, వాణిజ్య సౌలభ్యం, ఆర్థిక భద్రతా సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు తెలిసింది.

ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News