Senator Lindsey Graham: పాక్ మధ్యవర్తిత్వం పెద్ద సమస్య: ట్రంప్ సన్నిహిత సెనెటర్ లిండ్సే గ్రాహం
ట్రంప్ సన్నిహిత సెనెటర్ లిండ్సే గ్రాహం
Senator Lindsey Graham: అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించడం తీవ్ర సమస్య అని అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా విమర్శించారు. ట్రంప్‌కు దగ్గరి సన్నిహితుడైన గ్రాహం ఈ వ్యాఖ్యలు చేయడం దృష్టి ఆకర్షిస్తోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అబ్రహాం ఒప్పందాల్లో సంతకం చేయాలని పాకిస్థాన్‌ను కోరిన విషయం తెలిసిందే. అయితే, ఇజ్రాయెల్‌పై వ్యతిరేకతతో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు.
ఈ నేపథ్యంలో సెనెటర్ లిండ్సే గ్రాహం తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, "పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా ఉపయోగించడమే అతి పెద్ద సమస్య" అని అన్నారు. ఇజ్రాయెల్‌పై పాక్ దీర్ఘకాలిక విద్వేషం ఉందని, దాని ఉన్నతాధికారులు ఇజ్రాయెల్‌పై చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్‌పై నమ్మకం లేదని చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన మాటలు తనను భయపెట్టాయని గ్రాహం తెలిపారు. అబ్రహాం ఒప్పందాలపై త్వరగా స్పందించాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు.
ఇటీవల అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ తన సైనిక విమానాలను పాక్ ఎయిర్‌బేస్‌లలో పార్క్ చేసినట్లు వచ్చిన వార్తలను కూడా గ్రాహం ప్రస్తావించారు. ఈ విషయం అబద్ధం కాదని స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు ఇండో-పాక్ సంబంధాలు, అమెరికా-పాక్ బంధాలపై కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది.