Pete Hegseth: ఇరాన్‌పై అమెరికా నిర్ణయాత్మక విజయం: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ కూలిపోయింది- అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ కూలిపోయింది- అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్
Pete Hegseth: ఇరాన్‌పై అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో యునైటెడ్ స్టేట్స్ నిర్ణయాత్మక విజయం సాధించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఇరాన్ కొత్త ప్రభుత్వం తమ దుర్భర పరిస్థితిని గ్రహించి, ఒప్పందమే మేలని భావించి కాల్పుల విరమణకు ప్రాధేయపడిందని ఆయన తెలిపారు.
వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హెగ్సెత్ మాట్లాడారు. “నిమిషాల్లో ఇరాన్‌ను కుప్పకూల్చే శక్తి మాకు ఉన్నప్పటికీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దయ చూపించారు. ఇరాన్ మా షరతులకు ఒప్పుకోకపోతే తీవ్రమైన దాడులు జరిగేవి” అని హెగ్సెత్ వ్యాఖ్యానించారు.
అమెరికా దళాలు వరుస దాడులతో ఇరాన్ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేశాయని, ఆ దేశం వద్ద ఉన్న క్షిపణి నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశాయని ఆయన పేర్కొన్నారు. “ఇకపై ఇరాన్ క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు వంటి ఏ ఆయుధాలను తయారు చేయలేదు. 47 ఏళ్లుగా మాకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పు ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది” అని హెగ్సెత్ అన్నారు.
ఇజ్రాయెల్‌తో కలిసి చేపట్టిన ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని కూడా రక్షణ మంత్రి వెల్లడించారు. మంగళవారం రాత్రి అమెరికా దళాలు ఇరాన్‌లోని 800 లక్ష్యాలపై దాడులు చేశాయని సమాచారం.
ఈ విజయంతో ఇరాన్ యొక్క అణు కార్యక్రమం, సైనిక శక్తి గణనీయంగా దెబ్బతిన్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం టారిఫ్‌లు విధించేందుకు సిద్ధమైందని కూడా హెచ్చరికలు జారీ చేశారు.
ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచ శాంతికి కొత్త మార్గం వెలుగులోకి వచ్చిందని, ఇరాన్ ఇకపై అమెరికా, ఇజ్రాయెల్‌లకు ముప్పు కాదని అమెరికా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.