Power Centralization in Iran: ఇరాన్‌లో అధికార కేంద్రీకరణ.. ఖమేనీ చుట్టూ ఐఆర్‌జీసీ కట్టుదిట్టమైన నియంత్రణ

ఖమేనీ చుట్టూ ఐఆర్‌జీసీ కట్టుదిట్టమైన నియంత్రణ

Update: 2026-04-22 06:26 GMT

Power Centralization in Iran: ఇరాన్‌లో రాజకీయ పరిస్థితులు కీలక మలుపు తిరుగుతున్నాయి. దేశంలోని శక్తివంతమైన సైనిక సంస్థ అయిన ఐఆర్‌జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటూ అధికార వ్యవస్థపై పట్టు బిగిస్తున్నట్లు సమాచారం వెలువడుతోంది.

తాజా పరిణామాల ప్రకారం, సుప్రీం లీడర్‌గా ఎదుగుతున్న మొజ్తబా ఖమేనీ చుట్టూ ఐఆర్‌జీసీ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పరచింది. ఆయనను ప్రభుత్వ యంత్రాంగం నుంచి కొంతవరకు దూరంగా ఉంచుతూ కీలక వ్యవహారాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ నిర్ణయాలు, ఉన్నతస్థాయి నియామకాలు వంటి కీలక అంశాల్లో సివిల్‌ పాలన పాత్ర తగ్గిపోతుండగా, ఐఆర్‌జీసీ ప్రభావం స్పష్టంగా పెరుగుతోంది. దీంతో దేశ పరిపాలనలో సైనికాధిపత్యం మరింత బలపడుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అదేవిధంగా, ఖమేనీ ఆరోగ్య పరిస్థితి, ఆయన ప్రజల్లో కనిపించకపోవడం వంటి అంశాలు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పేరుతో వెలువడుతున్న ప్రకటనలు కూడా ఐఆర్‌జీసీ ప్రభావంతోనే వస్తున్నాయన్న చర్చ సాగుతోంది.

ఇక అధికార మార్పిడి ప్రక్రియలో కూడా ఐఆర్‌జీసీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నిర్ణయాలపై ఒత్తిడి తీసుకువచ్చి తమకు అనుకూలంగా పరిణామాలను మలిచిందని నివేదికలు సూచిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, ఇరాన్‌లో సైనిక వ్యవస్థ ప్రభావం పెరిగి రాజకీయ వ్యవస్థపై పట్టు బిగుస్తున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో దేశ రాజకీయ దిశను ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News