మిస్‌ వరల్డ్‌కు ప్రిపేర్‌ అవడం అంతా రహస్యం - మిస్‌ ఉగాండా నతాషా

Update: 2025-05-23 06:31 GMT
  • whatsapp icon


మిస్‌ వరల్డ్‌ పోటీలో పాల్గొనడం, ఈ పోటీకోసం ప్రిపేర్‌ అవడం అంతా రహస్యమని, అది బహిరంగంగా చెప్పలేనని ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశం నుంచి వచ్చిన మిస్‌ ఉగాండా నతాషా చెప్పారు. అయితే, ఈ పోటీకి వచ్చేముందు, పాల్గొనే ముందు.. కాన్ఫిడెన్స్‌, సెల్ఫ్ బిలీఫ్‌ అవసరమని చెప్పారు. ఇవి ఉంటే ఏదైనా సాధ్యమేనన్నారు.



తెలంగాణలోని హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలో తమ దేశం నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. ఇది నాకు తొలి భారత్‌ టూర్‌ అని చెప్పారు. తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, ఈసారి మిస్ వరల్డ్ పోటీ ప్రత్యేకంగా జరగనుందని, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎడిషన్లలో ఉత్తమమైనదిగా ఉండొచ్చని నతాషా అభిప్రాయ పడ్డారు.



తాను కొన్ని భారతీయ సినిమాలు చూశానన్న నతాషా.. వాటిలో.. ‘బర్ఫీ’ తన ఫేవరెట్ అని చెప్పారు. ముఖ్యంగా రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా నటన నచ్చిందన్నారు. ప్రియాంక చోప్రా తన ఫేవరెట్ ఇండియన్ యాక్ట్రస్ మాత్రమే కాదు, తన ఫేవరెట్ మిస్ వరల్డ్ కూడా అని చెప్పారు. ఆమె ఆటిజం గురించి చెప్పే పాత్రను అద్భుతంగా పోషించారని, ఇది తన ‘బ్యూటీ విత్ పర్పస్’ ప్రాజెక్ట్‌తో కూడా సంబంధం ఉందన్నారు. అందుకే ఆ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని, తన మనసును తాకిందని అన్నారు.



తన ప్రేమను, ఆశయాన్ని గురించి అడిగితే.. “ఓం శాంతి ఓం” అంటూ ముగించారు మిస్‌ ఉగాండా నతాషా.




Tags:    

Similar News