Ghalibaf Objects: ఇరాన్ ఆస్తుల విడుదలపై వివాదం.. అమెరికా వస్తువులే కొనాలని ట్రంప్, ఘాలిబాఫ్ తీవ్ర అభ్యంతరం

ఘాలిబాఫ్ తీవ్ర అభ్యంతరం

Update: 2026-06-26 14:45 GMT

Ghalibaf Objects: ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (MOU) ప్రకారం విదేశాల్లోని ఇరాన్ ఆస్తులను విడిపించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే ఈ నిధులు టెహ్రాన్‌కు నేరుగా చేరవని, ఇరాన్‌లోని ఆహార కొరత సమస్యను పరిష్కరించడానికి అమెరికా రైతుల నుంచి మొక్కజొన్న, గోధుమలు వంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఆస్తుల విడుదల ద్వారా అమెరికా రైతులు లాభపడతారని, ఆహార సంక్షోభంతో బాధపడుతున్న ఇరాన్ ప్రజలకు ఆహారం అందించడం లక్ష్యమని ఆయన వివరించారు.

ఈ ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ, ఆస్తులతో అమెరికా వస్తువులు కొనాలని ట్రంప్ చేస్తున్న వాదన తప్పుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహనా పత్రంలో అమెరికా వస్తువుల కొనుగోలును తప్పనిసరి చేసే ఎలాంటి చట్టపరమైన నిబంధనలు లేవని స్పష్టం చేశారు. విదేశాల్లోని తమ ఆస్తులను విడుదల చేయాలని ఒప్పందంలో భాగంగా అమెరికాకు ఇప్పటికే తెలియజేశామని, ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేయడం అమెరికా బలహీనతకు నిదర్శనమని ఘాలిబాఫ్ అన్నారు.

ఈ అంశం ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.

Tags:    

Similar News