Angara Flight Crashed : చైనా సరిహద్దుల్లో కుప్పకూలిన రష్యా విమానం

సిబ్బందితో సహా 49 మంది ప్రయాణికులు మృతి;

Update: 2025-07-24 09:33 GMT

రష్యాలో గురువారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న అంగారా ఎయిర్‌ లైన్స్‌ విమానం చైనా సరిహద్దులో కుప్పకూలిపోయింది. ఐదుగురు చిన్నారులతో సహా 43 మంది ప్రయాణికులు ఆరుగురు విమాన సంస్ధ సిబ్బంది మొత్తం 49 మంది ఈ దుర్ఘటనలో మృతి చెందినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం రష్యాలోని ఇగ్నత్యేవో విమానాశ్రయం నుంచి చైనా దేశ సరిహద్దుల్లో ఉన్న టిండా సిగిక్తా ఎయిర్‌ పోర్ట్‌ కు బయలుదేరింది. మరి కొద్ది సేపట్లో టిండా ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్‌ అవుతుందనగా ఎయిర్‌ పోర్ట్ కి కొద్ది కిలో మీటర్ల దూరంలో ఈస్ట్రన్‌ అమూర్‌ రీజియన్‌ సమాపంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ తో సంబంధాలు తప్పిపోయాయి. దీంతో విమానం అదృశ్యమైనట్లు అధికారులు ప్రకటించారు. వెంటనే సెర్చ్‌ పార్టీలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. కొద్దిసేపటికి అమూర్‌ రీజియన్‌ లోని దట్టమై అటవీ ప్రాంతంలో అంగారా విమాన శకలాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన తీరును బట్టి విమానంలో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా ప్రాణాలతో బయపడే అవకాశం లేదని సెర్చ్‌ బృందాలు చెపుతున్నాయి.

Tags:    

Similar News