US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వరుస హత్యాయత్నాలు: "నేను ఎంతకాలం ఉంటానో తెలియదు"

"నేను ఎంతకాలం ఉంటానో తెలియదు"

Update: 2026-02-24 07:05 GMT

US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై జరుగుతున్న వరుస హత్యాయత్నాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తనను హతమార్చడానికి అనేక మంది ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులను బట్టి తాను ఎంతకాలం బతికి ఉంటానో తనకు తెలియడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటువంటి హత్యాయత్నాలు సాధారణ అధ్యక్షులపై జరగవని, అసాధారణ విజయాలు సాధించిన అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్. కెన్నడీల హత్యలను ఉదాహరణగా చూపారు. అయితే, ఇలాంటి బెదిరింపులు ఎన్ని ఎదురైనా తాను తీసుకునే నిర్ణయాలపై ఏ మాత్రం వెనక్కి తగ్గబోనని గట్టిగా చెప్పారు.

ఇటీవల ఫ్లోరిడాలోని తన మార్-ఎ-లాగో నివాసంలోకి సాయుధుడు చొరబడిన ఘటనపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ఆ దుండగుడు ఆయుధంతోపాటు ఇంధనం క్యాన్‌తో నివాసంలోకి ప్రవేశించాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హెచ్చరించినా వినకపోవడంతో అతడిని భద్రతా సిబ్బంది హతమార్చారు.

గతంలో కూడా ట్రంప్‌పై పలు హత్యాయత్నాలు జరిగాయి. 2024 జులైలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ఒకరు కాల్పులు జరిపారు, ఆ ఘటనలో ట్రంప్ చెవి భాగం తూటాకు గాయపడింది. ఆ తర్వాత పామ్ బీచ్ గోల్ఫ్ కోర్సులో మరో అనుమానాస్పద వ్యక్తిని రైఫిల్‌తో పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనల నేపథ్యంలో ట్రంప్ తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, తన ఎజెండాపై దృఢంగా ఉంటానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News