Shock to US Secret Service in China: చైనాలో అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు షాక్.. ట్రంప్ పర్యటనలో ఉద్రిక్తతలు!

ట్రంప్ పర్యటనలో ఉద్రిక్తతలు!

Update: 2026-05-15 13:05 GMT

Shock to US Secret Service in China: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సాధారణంగా ఏ దేశానికి వెళ్లినా అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు పూర్తి నియంత్రణ చేపట్టినా.. చైనాలో మాత్రం వారి 'కమాండ్' పని చేయలేదు. చైనా భద్రతా సిబ్బంది అమెరికా సిబ్బందిని, జర్నలిస్టులను కట్టుబాట్లతో అడ్డుకోవడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

వైట్‌హౌస్ సిబ్బందిని నెట్టేసిన చైనా మీడియా

రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో గురువారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ వేదిక వద్ద చైనా మీడియా సిబ్బంది దూసుకొచ్చి వైట్‌హౌస్ సిబ్బందిని నెట్టుకుంటూ లోపలికి ప్రవేశించారు. ఈ ఘటనలో అమెరికా సిబ్బందిలో ఒకరు కిందపడి స్వల్ప గాయాలపాలయ్యారు. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

టెంపుల్ ఆఫ్ హెవెన్‌లో నో ఎంట్రీ

ఇరు నాయకులు బీజింగ్‌లోని ప్రసిద్ధ టెంపుల్ ఆఫ్ హెవెన్‌ను సందర్శించారు. ఈ సమయంలో యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వద్ద తుపాకీ ఉందన్న కారణంతో చైనా అధికారులు అతడిని ఆలయం లోపలికి అనుమతించలేదు. ఆయుధం అప్పగించాలని ఆదేశించగా, అమెరికా వైపు నుంచి అంగీకరించకపోవడంతో దాదాపు 30 నిమిషాల పాటు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి మరో సీక్రెట్ సర్వీస్ అధికారిని మాత్రమే లోపలికి అనుమతించగా, ఆయుధంతో ఉన్న ఏజెంట్ వెలుపలే నిలిచిపోయాడు.

అమెరికా జర్నలిస్టులను అడ్డుకున్న చైనా

ట్రంప్, జిన్‌పింగ్ టెంపుల్ నుంచి వెళ్తుండగా, ప్రెసిడెన్షియల్ మోటార్‌కేడ్‌లో చేరకుండా అమెరికా జర్నలిస్టులను చైనా అధికారులు ఆపివేశారు. ఈ విషయం తెలిసి అమెరికా సిబ్బంది తీవ్రంగా వాదించారు. అయినప్పటికీ సెక్యూరిటీ బారియర్లను దాటుకుని జర్నలిస్టులు కాన్వాయ్‌ను చేరుకున్నారు.

ఇంకా, అమెరికా రిపోర్టర్లకు వాటర్ బాటిళ్లు ఇవ్వకపోవడం, వాష్‌రూమ్ వినియోగంపై పరిమితులు విధించడం, ఫాక్స్ న్యూస్ వ్యాన్‌కు జరిమానా విధించడం వంటి ఆంక్షలు విధించినట్లు తెలిసింది. గత 2017లోనూ ట్రంప్ చైనా పర్యటన సమయంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్న విషయం గుర్తుచేస్తోంది.

ఈ ఘటనలు అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News