Sonam Wangchuk: లడాఖ్‌లో విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు, పర్యావరణ సమస్యలపై నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు అమెరికాలోనూ బలమైన మద్దతు వ్యక్తమవుతోంది. న్యూయార్క్‌, శాన్‌జోస్ నగరాల్లో ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’ సంస్థ కార్యకర్తలు బలమైన నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

వాంగ్‌చుక్‌కు పూర్తి మద్దతుగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ఎత్తి చూపుతూ నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే వాంగ్‌చుక్‌తో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఇక్కడితో పాటు లండన్‌లోని భారత హైకమిషన్ మరియు డబ్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం ఎదుట కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలో నిరసనలు జరిగినట్లు వెల్లడైంది.

20 రోజులకు పైగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో శనివారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రైవేటు ఆసుపత్రికి మార్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో మద్దతు తీవ్రం కావడం గమనార్హం.

Tags: