Pakistan Army Chief Asim Munir: ఆగండి... ఐడీ కార్డు చూపండి! మ్యూనిక్ సదస్సులో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌కు భద్రతా సిబ్బంది షాక్.. వీడియో వైరల్

మ్యూనిక్ సదస్సులో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌కు భద్రతా సిబ్బంది షాక్.. వీడియో వైరల్

Update: 2026-02-16 04:37 GMT

జర్మనీలో ఇబ్బందికర పరిస్థితి.. అంతర్జాతీయ వేదికపై గుర్తింపు లేకపోవడం వల్లేనా?


Pakistan Army Chief Asim Munir: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్‌కు జర్మనీలో అవమానకరమైన పరిస్థితి ఎదురైంది. మ్యూనిక్ అంతర్జాతీయ భద్రతా సదస్సు (మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్)లో పాల్గొనేందుకు వెళ్తుండగా, భద్రతా సిబ్బంది ఆయన్ను ఆపి ఐడీ కార్డు చూపించమని అడిగారు.

సదస్సు వేదిక వద్దకు చేరుకుంటుండగా, ఓ మహిళా భద్రతా అధికారిణి మునీర్‌ను ఉద్దేశించి "ఆగండి... మీ ఐడీ కార్డు ఎక్కడుంది? కనిపించేలా ఉంచండి" అని అన్నారు. ఐడీ కార్డును సరిగ్గా ఫ్లిప్ చేసి కనిపించేలా చేయమని సూచించారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మునీర్ కాస్త ఇబ్బందిగా కనిపించారు.

ఈ ఘటనపై పాక్ మాజీ సైనికాధికారి అదిల్ రాజా స్పందిస్తూ, "అంతర్జాతీయ వేదికలపై ఆసిం మునీర్‌ను ఎవరూ గుర్తించరు. గేట్ కీపర్లు ప్రశ్నిస్తే కూడా వినయంగా తనను 'ఫీల్డ్ మార్షల్' అని పరిచయం చేసుకుంటారు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది ప్రపంచ నాయకులు, రక్షణాధికారులు, దౌత్యవేత్తలు తీవ్ర భద్రతా అంశాలపై చర్చించే ప్రముఖ వేదిక. ఇక్కడ భద్రతా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఏ ఒక్కరినీ మినహాయించకుండా అందరికీ ఐడీ చెక్ తప్పనిసరి. అయితే, పాక్ ఆర్మీ చీఫ్ వంటి ఉన్నత అధికారికి ఇలాంటి సంఘటన జరగడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News