Iran Parliament Speaker Ghalibaf: హర్మూజ్ జలసంధి యుద్ధానికి ముందు స్థితికి ఎప్పటికీ తిరిగి రాదు: ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్

Update: 2026-06-23 06:27 GMT


Iran Parliament Speaker Ghalibaf: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలోనూ హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై అమెరికా-ఇరాన్ మధ్య ప్రకటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జలసంధి నిర్వహణను ఇరాన్‌ తన బాధ్యతగా చూస్తుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి ముందున్న స్థితికి హర్మూజ్ ఎప్పటికీ తిరిగి రాదని ఆయన స్పష్టం చేశారు.

అమెరికన్లను తమ దేశం ఎన్నడూ నమ్మలేదని, ప్రస్తుతం కూడా నమ్మడం లేదని, భవిష్యత్తులోనూ అదే ధోరణి కొనసాగించడం సమంజసమేనని ఘాలిబఫ్ అన్నారు. స్విట్జర్లాండ్‌లో ఇరాన్-అమెరికా మధ్య జరిగిన చర్చల్లో ఫ్రీజ్ చేసిన 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి తుది ఒప్పందం కుదిరినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ నుంచి సోయా, మొక్కజొన్న, గోధుమలు కొనుగోలు చేస్తే ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ అమెరికా పట్ల ఇరాన్ అపనమ్మకం కొనసాగుతోంది.

ట్రంప్ భిన్న వ్యాఖ్యలు

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ప్రకటించారు. ఈ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్ దేశం అంతర్జాతీయ చట్టాలు, టోల్ రహిత ప్రయాణానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్లు ఒమన్ తెలిపింది.

ప్రస్తుతం హర్మూజ్ జలసంధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది. ప్రపంచంలోని చాలా భాగం క్రూడ్ ఆయిల్ ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News