Iran: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రగులుతున్నాయి.. ఇరాన్ ప్రతీకార దాడులు!

ఇరాన్ ప్రతీకార దాడులు!

Update: 2026-07-09 05:30 GMT

Iran: పశ్చిమాసియా ప్రాంతం దద్దరిల్లుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు తీవ్ర రూపం తీసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులు చేస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాడులు జరిగాయి. దీనికి ప్రతీకారంగా గురువారం ఇరాన్ అమెరికా స్థావరాలపై దాడులు ప్రారంభించింది.

గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేసులను ఇరాన్ టార్గెట్ చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాదళం ఫిఫ్త్ ఫ్లీట్ హెడ్‌క్వార్టర్స్‌లో మంటలు చెలరేగిన దృశ్యాలను ఇరాన్ మీడియా ప్రసారం చేసింది. కువైట్, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై కూడా దాడులు జరిగినట్లు వెల్లడైంది. కువైట్ వైపు వస్తున్న డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

ట్రంప్ హెచ్చరిక:

హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులు చేస్తే ఏమాత్రం సహించబోమని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ చేసే ఒక్క దాడికి 20 రెట్లు తీవ్రమైన ప్రతీకారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ డీల్ కోసం తహతహలాడుతోందని, ఇరాన్ నుంచి కాల్ వచ్చిందని తుర్కియే నుంచి వస్తూ తన విమానంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఇప్పటికే బందర్ అబ్బాస్, బుషెహర్, సిరిక్, జస్క్, అబూ మూసా ద్వీపం వంటి ప్రాంతాలపై అమెరికా దాడులు నిర్వహించింది.

అమెరికా వాదన:

ఇరాన్‌లోని 90 లక్ష్యాలను ఢీకొట్టామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. సంబంధిత వీడియోను కూడా విడుదల చేసింది. ఈ దాడులతో తాజా విడత ముగిసినట్లు తెలిపింది. ఇరాన్ వైపు నుంచి మషహద్ నగరానికి వెళ్లే రెండు వంతెనలు కూడా దాడి లక్ష్యాల్లో ఉన్నాయని వెల్లడైంది. ఆ నగరంలోనే ఆయతుల్లా అలీ ఖమేనీ సమాధి జరగనుంది.

పరిస్థితి ఎలా మారుతుందనేది ప్రస్తుతం అనిశ్చితిగా ఉంది. పశ్చిమాసియా శాంతి భద్రతలపై ఈ ఘర్షణలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags:    

Similar News