Donald Trump: ఇరాన్‌పై భీకర దాడులపై ఉత్కంఠ.. కీలక చర్చల్లో ట్రంప్

కీలక చర్చల్లో ట్రంప్

Update: 2026-07-25 04:34 GMT

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై భీకర దాడులు చేయాలా వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని, ఆ దేశం చర్చలను సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ‘‘వారు లొంగిపోవచ్చు లేదా గుహల్లోకి వెళ్లి దాక్కోవచ్చు. మా వైపు నుంచి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. యుద్ధం ముగించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి దాడుల తీవ్రత పెంచి వారి వద్ద ఉన్నదంతా నాశనం చేయడం. రెండోది ఒప్పందం చేసుకోవడం. డీల్ చేసుకోవడం తెలివైన వ్యూహం. చర్చలు సీరియస్‌గా ఉన్నంత మాత్రాన ఒప్పందం కుదురుతుందని చెప్పలేం. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి’’ అని ట్రంప్ అన్నారు.

ఇంతకు ముందు ఇరాన్‌పై భీకర దాడులను పరిశీలిస్తున్నామని ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ అమెరికా బెదిరింపులకు తలొగ్గబోమని, బలప్రయోగం లేదా ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించబోమని స్పష్టం చేసింది.

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags:    

Similar News