West Africa : పశ్చిమాఫ్రికాలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్‌

సిమెంట్‌ ఫ్యాక్టరీని పేల్చి ఉద్యోగులను కిడ్నాప్‌ చేసిన అల్‌ఖైదా;

Update: 2025-07-05 03:30 GMT

పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో పని చేస్తున్న ముగ్గురు భారతీయులను అల్‌ఖైదాకు చెందిన తీవ్రవాదులు కిడ్నాప్‌ చేసి ఎత్తుకు వెళ్లారు. మాలిలో భారతీయ వ్యాపారవేత్తకు చెందిన డైమండ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీలో ఈ ముగ్గురు పనిచేస్తున్నారు. హైదబాద్‌ కు చెందిన మోటపర్తి ప్రసాద్‌ అనే వ్యక్తికి చెందిన డైమండ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీని పేల్చివేసి అదే కంపెనీలో పనిచేస్తున్న జనరల్‌ మేనేజర్‌తో పాటు లిఫ్ట్‌ ఇంజనీర్‌, ఆటోమొబైల్‌ ఫోర్మాన్లను ఆల్‌ఖైదాకు ఉగ్రవాద సంస్ధకు సంబంధించిన జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జెఎన్‌ఐఎమ్‌) సంస్ధ కిడ్పాప్‌ చేసింది. పశ్చిమ ఆఫ్రికా మాలీ ప్రాంతంలో ఉన్న మూడు సిమెంట్‌ కర్మాగారాలపై అల్ ఖైదా అనుబంధ సంస్ధ జెఎన్‌ఐఎమ్‌ ఉగ్ర సంస్ధ ఒకే సారి దాడులు చేసింది. హైదరాబాద్‌ సారధి స్టూడియోస్‌ అధినేత కూడా అయిన మోటపర్తి ప్రసాద్‌ గత కొన్నేళ్ళుగా పశ్చిమ ఆఫ్రికా, ఘనా, టోగో దేశాల్లో సిమెంట్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. ఆ దేశాల్లో నిర్వహిస్తున్న సిమెంట్‌ కంపెనీల్లో ప్రసాద్ కు 27.5 శాతం వాటాలు ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై మాలీ రాజధాని బమాకోలో ఉన్న భారత రాయబార కార్యాలయం స్పందించింది. మాలీ ప్రభుత్వ అధికారులు, స్థానిక భద్రతా సంస్ధలతో పాటు డైమండ్‌ సిమెంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతోంది. కిడ్నాప్‌ కు గురైన భారతీయుల కుటుంబ సభ్యులతో కూడా రాయబార కార్యాయలం చర్చలు జరుపుతోంది. ఉగ్రవాదుల ఈ చర్యను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కిడ్నాప్‌ కు గురైన ముగ్గురు భారతీయులను వెంటనే విడుదల చేయిండానికి తగిన చర్యలు తీసుకోవాలని భాతర ప్రభుత్వం.. మాలీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.

Tags:    

Similar News