Trump Faces Insider Trading Allegations: ట్రంప్ ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు.. యుద్ధం వేళ రక్షణ రంగం, టెక్ కంపెనీల్లో భారీ పెట్టుబడులు!

యుద్ధం వేళ రక్షణ రంగం, టెక్ కంపెనీల్లో భారీ పెట్టుబడులు!

Update: 2026-05-20 09:36 GMT

Trump Faces Insider Trading Allegations: ప్రపంచం యుద్ధాల భీతితో కలవరపడుతుంటే.. అమెరికా అధ్యక్పుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం మాత్రం లాభాల వర్షం కురిపిస్తోందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో రక్షణ రంగ సంస్థలతో పాటు తన విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే కంపెనీల్లో ట్రంప్ కుటుంబం వేల సంఖ్యలో స్టాక్ ట్రేడింగ్ లావాదేవీలు చేసినట్లు వెల్లడైంది. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది.

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లోనే ట్రంప్ ఫ్యామిలీ పోర్ట్‌ఫోలియోలో వేలాది లావాదేవీలు నమోదయ్యాయి. ఫెడరల్ ఎథిక్స్ ఏజెన్సీకి సమర్పించిన రిపోర్టు ప్రకారం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు జరిగాయి. కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ పోర్ట్‌ఫోలియోలో లాక్‌హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్త్‌రాప్ గ్రూమన్ వంటి అమెరికా ఆయుధ తయారీ సంస్థల షేర్లు ముఖ్యంగా ఉన్నాయి. ఇవి పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల లాభపడే అవకాశం ఉన్న సంస్థలు.

ఇటీవల చైనా పర్యటన సందర్భంగా ట్రంప్ ఎన్విడియా (Nvidia) చిప్‌ల ఎగుమతి నిబంధనలను సడలించారు. ఆ నేపథ్యంలో ట్రంప్ కుటుంబం సుమారు 6 మిలియన్ డాలర్ల విలువైన ట్రేడింగ్ చేసినట్లు సమాచారం. ఎన్విడియాతో పాటు యాపిల్, బోయింగ్, టెస్లా వంటి దిగ్గజ సంస్థల్లో కూడా వారి పెట్టుబడులు ఉన్నాయి. చైనా పర్యటనలో ఈ కంపెనీల సీఈఓలు కూడా ట్రంప్‌తో పాటు ఉన్నారు.

ఎథిక్స్ సమస్యలు.. విమర్శలు:

అమెరికా చట్టాల ప్రకారం సాధారణ ప్రభుత్వ ఉద్యోగులు తమ విధానాలతో ప్రభావితమయ్యే సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుమతి లేదు. అయితే అధ్యక్పుడికి మినహాయింపు ఉంది. దీన్ని ఆసరాగా ట్రంప్ తన నిర్ణయాలను స్వంత లాభం కోసం ఉపయోగించుకుంటున్నారని ఎథిక్స్ నిపుణులు, మాజీ అధికారులు విమర్శిస్తున్నారు. “రక్షణ శాఖ మంత్రి అయితే ఇది నేరం. అధ్యక్పుడికి టెక్నికల్‌గా అనుమతి ఉంది కానీ ఇది నమ్మకాన్ని ఉల్లంఘించడమే” అని వారు అభిప్రాయపడ్డారు.

వాన్స్ సమర్థన:

ఈ విమర్శలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. “ట్రంప్ అధ్యక్ష కార్యాలయంలో కంప్యూటర్ ముందు కూర్చొని ట్రేడింగ్ చేయరు. స్వతంత్ర థర్డ్ పార్టీలు ఆయన పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్నారు” అని స్పష్టం చేశారు.

ఈ సంఘటనలు అమెరికా రాజకీయాల్లో మరోసారి ఎథిక్స్, కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ చర్చలను రగుల్చాయి. ట్రంప్ బృందం మాత్రం అన్నీ చట్టబద్ధంగానే జరుగుతున్నాయని వాదిస్తోంది.

Tags:    

Similar News