Trump: ట్రంప్: వైట్‌హౌస్‌లో మాజీ అధ్యక్షుల సమావేశం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌తో రీయూనియన్!
ఫుట్‌బాల్ మ్యాచ్‌తో రీయూనియన్!
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాళీ సమయంలో వార్తాపత్రికలు చదవడం ఇష్టపడతారని, ముఖ్యంగా తన గురించి వచ్చిన వార్తలను ఎక్కువగా చూస్తానని వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ హోస్ట్ చేసిన ‘స్టోరీ టైమ్ విత్ సెకండ్ లేడీ’ అనే పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు.
ఈ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్ వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన ‘ప్రెసిడెంట్స్ ప్లే!’ పుస్తకాన్ని ప్రస్తావించారు. ఆ పుస్తకంలో ఒక మాజీ అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో సూపర్‌బౌల్ ఫుట్‌బాల్ మ్యాచ్ లైవ్‌గా చూస్తున్న ఫోటోను చూపిస్తూ ట్రంప్ సరదాగా ఒక ఆలోచన చెప్పారు.
“ఈ ఫోటో చూసి నాకు ఒక ఐడియా వచ్చింది. బరాక్ ఒబామా, జో బైడెన్, బుష్ కుటుంబాలను వైట్‌హౌస్‌కు ఆహ్వానించి ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తే ఎంత బాగుంటుంది. అధ్యక్షుల రీయూనియన్ లాగా ఉంటుంది. అలా జరిగితే పత్రికలు, మీడియా హోరెత్తేస్తాయేమో!” అని ట్రంప్ సరదాగా అన్నారు.
అధ్యక్షులు వైట్‌హౌస్‌లో ఖాళీ సమయంలో ఏం చేస్తారనే అంశంపై కూడా ట్రంప్ మాట్లాడారు. “అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో గడిపే సమయం చాలా తక్కువ. ప్రజల సేవ కోసం అక్కడ ఉండటం గౌరవం. బిల్ క్లింటన్ తన కోసం ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించుకుని జాగింగ్ చేసేవారు. ఇటీవలే ఈ విషయం తెలిసింది. నేను అలా చేయలేను అనుకుంటా. క్లింటన్ మంచి వ్యక్తి, ఆయనంటే నాకు ఇష్టమే” అని కొనియాడారు.
అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ పాడ్‌కాస్ట్ వీడియోను ఉషా వాన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. ఈ కార్యక్రమం వైట్‌హౌస్ ప్రాంగణంలో నిర్మిస్తున్న కొత్త బాల్‌రూమ్ గురించి కూడా ప్రస్తావించింది.