US Air Defense Missile: ఇరాన్ యుద్ధంతో అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు తగ్గుముఖం

ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు తగ్గుముఖం

Update: 2026-05-22 09:52 GMT

US Air Defense Missile: ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా తన క్షిపణి నిల్వలలో సగం భాగం ఖాళీ చేసినట్లు సమాచారం. ఈ యుద్ధంలో అమెరికా భారీ స్థాయిలో థాడ్‌, స్టాండర్డ్‌ మిసైల్‌లను వినియోగించడంతో రక్షణ రంగ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివిధ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్‌పై అమెరికా 200కు పైగా థాడ్‌ (THAAD) క్షిపణులను ప్రయోగించింది. అంతేకాకుండా, మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్‌ మిసైల్‌-3, స్టాండర్డ్‌ మిసైల్‌-6లను ఉపయోగించింది. దీంతో పెంటగాన్‌ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్‌ నిల్వలు సగానికి సగం పడిపోయాయి. ప్రస్తుతం అమెరికా వద్ద సుమారు 200 థాడ్‌ ఇంటర్‌సెప్టర్‌లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌ కూడా ఈ యుద్ధంలో తన నిల్వలను గణనీయంగా వినియోగించింది. ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్‌సెప్టర్‌లు, 90 డేవిడ్‌ స్లింగ్‌ క్షిపణులను ఉపయోగించినట్లు సమాచారం. వీటిలో కొన్ని యెమెన్‌, లెబనాన్‌ల నుంచి వచ్చే దాడులను అడ్డుకోవడానికి వాడబడ్డాయి.

రక్షణ నిపుణులు ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక సమన్వయంలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. మరోసారి ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభమైతే అమెరికా క్షిపణి నిల్వలపై మరింత ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరించారు.

అయితే, పెంటగాన్‌ ఈ సమన్వయాన్ని సమర్థించింది. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో ఇరు దేశాలు రక్షణ భారాన్ని సమానంగా మోశాయని పెంటగాన్‌ ప్రధాన ప్రతినిధి సీన్‌ పార్నెట్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించింది.

ఈ పరిణామాలు అంతర్జాతీయ రక్షణ రంగంలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి.

Tags:    

Similar News