War Impact in Dubai: దుబాయ్‌లో యుద్ధ ప్రభావం – ఎమిరేట్స్ విమానాలపై ప్రభావం

ఎమిరేట్స్ విమానాలపై ప్రభావం

Update: 2026-03-17 06:21 GMT

War Impact in Dubai: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దుబాయ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా రద్దీతో కళకళలాడే దుబాయ్ విమానాశ్రయం ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది. ఎమిరేట్స్ వంటి ప్రధాన ఎయిర్‌లైన్ విమానాలు దాదాపు ఖాళీగా నడుస్తున్నాయని తెలుస్తోంది.

బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, ఇతర దేశాల నుంచి దుబాయ్‌కు వచ్చే ఎమిరేట్స్ విమానాల్లో ప్రయాణికులు చాలా తక్కువగా ఉంటున్నారు. అమెరికా, ఐరోపా దేశాల నుంచి వచ్చే ఫ్లైట్లు కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే ఆక్యుపెన్సీతో తిరిగొస్తున్నాయి. ఉదాహరణకు, న్యూయార్క్ నుంచి వచ్చే విమానాల్లో సాధారణంగా 500 సీట్ల ఎయిర్‌బస్ A380లో కేవలం ఐదో వంతు టికెట్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. గత వారం కొన్ని విమానాల్లో 35 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నట్లు సమాచారం.

యుద్ధ భయాలు, ఉద్రిక్తతల కారణంగా చాలామంది పశ్చిమాసియా ప్రాంతాన్ని వీడుతున్నారు. దుబాయ్ నుంచి బయటకు వెళ్లే విమానాలు ఇంకా రద్దీగా ఉండగా, తిరిగి వచ్చే ఫ్లైట్లలో ప్రయాణికులు దాదాపు లేరన్నట్లుగా ఉన్నారు. ఈ పరిస్థితి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్‌కు పెద్ద సవాలుగా మారింది. దుబాయ్ అంటే బాబోయ్ అంటున్న జనం ఇప్పుడు భయపడుతున్నారు. ఈ యుద్ధ ప్రభావం వల్ల పర్యాటకం, వ్యాపార రంగాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఈ సమస్యలు త్వరలో తగ్గుతాయా లేదా మరింత ముదిరిపోతాయా అనేది యుద్ధ పరిస్థితులపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయం ఖాళీ సీట్లతో నిండి ఉంది, ఎమిరేట్స్ విమానాలు 'ఘోస్ట్ ఫ్లైట్లు'గా మారాయి.

Tags:    

Similar News