United States Citizens: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికన్లకు ఏమాత్రం లాభం లేదు!

అమెరికన్లకు ఏమాత్రం లాభం లేదు!

Update: 2026-04-15 07:21 GMT

United States Citizens: పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న యుద్ధం తన సైన్యానికి తీవ్ర నష్టాలు కలిగిస్తోందని, దీని వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని అమెరికన్ ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇటీవల ఇప్సాస్‌-రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో ఇది స్పష్టంగా వెల్లడైంది.

గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా ఇటీవల హర్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. అయితే ఈ చర్యలను 54 శాతం అమెరికన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ యుద్ధం తమ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తోందని వారు అభిప్రాయపడ్డారు.

సర్వే వివరాల ప్రకారం.. 65 శాతం డెమోక్రాట్లు, 56 శాతం ఇండిపెండెంట్లు, 40 శాతం రిపబ్లికన్లు ఈ యుద్ధ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు సరైనవేనని మాత్రం 24 శాతం మంది మాత్రమే సమర్థించారు. మరో 22 శాతం మంది ఈ అంశంపై ఎలాంటి స్పందన ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు.

ఇక రిపబ్లికన్ పార్టీలోనే 54 శాతం మంది యుద్ధానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, మిగిలిన వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సర్వే తెలిపింది. దీంతో రిపబ్లికన్ పార్టీలో చీలికలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ సర్వే ఫలితాలు అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న యుద్ధ నిర్ణయాలపై ప్రజల అసంతృప్తిని స్పష్టంగా చూపుతున్నాయి. హర్మూజ్ దిగ్బంధన కోసం 10 వేల మంది సైనికులను మోహరించిన అమెరికా చర్యలు ఇకపై ఎలా ముందుకు సాగుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News