Yaman Nimisha Priya : యెమన్‌లో నిమిష ప్రియ మరణశిక్ష రద్దు
ప్రకటన విడుదల చేసిన మత ప్రబోధకుడు అబూబకర్ కార్యాలయం
యెమన్ దేశంలో ఉరిశిక్ష పడ్డ భారత సంతతి నర్సు నిమిష ప్రియకు ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది. సున్నీ మత ప్రభోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ కార్యాలయం సోమవారం అర్ధరాత్రి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. యెమన్ దేశంలో మరణశిక్ష విధింపబడ్డ నిమిష ప్రియకు ఆ శిక్షను శాశ్వతంగా రద్దు చేసినట్లు కాంతపురం ఏపీ అబూబకర్ కార్యలయం ప్రకటించింది. దీంతో నిమిష ప్రియ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ విషంయలో భారత విదేశాంగ శాఖ నంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. నిమిషప్రియకు మరణశిక్ష రద్దు చేయాలని భారత దేశం నుంచే కాక వివిధ మత ప్రభోధకుల నుంచి కూడా యెమన్ దేశానికి అనేక విజ్ఞప్తులు వచ్చాయి. కాంతాపురం ఏపీ అబూబకర్ తో పాటు ప్రముఖ క్రీస్టియన్ ఎవాంజలిస్ట్ కేఏపాల్ సైతం నిమిష ప్రియ మరణ శిక్ష రద్దు చేయించడానికి కృషి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అభ్యర్ధనల నేపథ్యంలో యెమన్ రాజధాని సనా నగరంలో ఆ దేశ అధికారులు ఒక అత్యున్నత స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తర యెమన్ అధికారులు, అతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొని నిమిషప్రియకు మరణశిక్ష శాశ్వతంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు యెమన్ మీడియాలో వార్తాలు వచ్చాయి. అయితే నిమిషప్రయకు మరణశిక్ష రద్దు చేసినప్పటికీ వెంటనే ఆమెను విడుదల చేస్తారా లేక కారాగార శిక్ష అమలు చేస్తారా అనే విషయంపై స్పష్టత రాలేదు. ఈవిషయంలో హతుడి కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.