Bonalu Festival: చరిత్రలో నిలిచేలా బోనాల పండుగకు ఏర్పాట్లు చేయండి : మంత్రి పొన్నం
బోనాల పండుగకు ఏర్పాట్లు చేయండి : మంత్రి పొన్నం;
Bonalu Festival: చరిత్రలో నిలిచేలా ఆషాడ బోనాల పండుగకు ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు బోనాల ఉత్సవాలపై సనత్ నగర్ శాసన సభ్యుడూ శ్రీనివాస యాదవ్ తో మరియూ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహించు కుందామన్నారు. స్థానికుల సహకారం లేకపోతె ప్రభుత్వం ఎన్ని కార్యక్రమలు నిర్వహించిన విజయవంతం కావన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు ఆతిథ్యం ఇవ్వడంలో ఎవరికీ తీసిపోరన్నారు. స్థానిక ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు వారి ఆతిథ్యం ఇవ్వాలన్నారు. నగరంలో బోనాల పండగ ఒక్కొక వారం ఒక్కొక ప్రాంతం లో జరుగుతుంది, కాబట్టీ ఆ ప్రాంతంలో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అవసరాలమైతే రెండు సార్లు నీటిని ఇవ్వాలన్నారు. ‘ అమ్మవారి ఆశీర్వాదంతో... ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని, ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా జరగాలి.' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.