పెళ్లయినవాళ్లూ కలలను నెరవేర్చుకోవచ్చు - మిస్‌ యూనివర్స్‌ మహారాష్ట్ర అండ్లీబ్‌ జైదీ

Married people can also fulfill their dreams - Miss Universe Maharashtra Andleeb Zaidi

Update: 2025-06-24 09:30 GMT


మిస్ యూనివర్స్ మహారాష్ట్రగా నిలిచిన మోడల్, డిజైనర్ అండ్లీబ్‌ జైదీ హైదరాబాద్‌ టూర్‌లో తన జీవిత ప్రయాణం, లక్ష్యాలు, భావోద్వేగాలను పొలిటెంట్‌ మీడియాతో షేర్‌ చేసుకున్నారు. ముంబయి నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమె, గత 10 సంవత్సరాలుగా ఇక్కడే చదువుతూ, పని చేస్తూ, జీవిస్తున్నట్టు వెల్లడించారు.

‘‘హైదరాబాద్ నా రెండవ ఇల్లు లాంటిది. ఇక్కడే నా కెరీర్ ప్రారంభమైంది. నా జీవితం ప్రస్తుతం ఉన్న స్థితికి హైదరాబాద్ చాలా కీలక పాత్ర పోషించింది,’’ అని ఆమె చెప్పారు. స్వస్థలం మహారాష్ట్ర అయినా, విద్య, ఉద్యోగం, పెళ్లి అంతా హైదరాబాద్‌లోనే అని పేర్కొన్నారు.

తనకు పెళ్లయ్యిందని, అంతేకాదు. తనకు పిల్లలు కూడా ఉన్నారన్న జైదీ.. ఇప్పుడు మిస్ యూనివర్స్ పోటీల్లో పెళ్లయిన మహిళలూ పాల్గొనొచ్చని చెప్పారు. అయినా తన కలను కొనసాగించగలిగానని వెల్లడించారు. తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం తనను ఈ దిశగా నడిపించిందని తెలిపారు. తండ్రి మరణానంతరం భర్త కూడా అండగా నిలిచారని చెప్పారు.

మోడల్, ఫ్యాషన్ డిజైనర్‌గా గత 10 ఏళ్లుగా పని చేస్తున్న ఆమె, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ – తన లక్ష్యం మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం గెలుచుకోవడమన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయతకు ప్రాతినిధ్యం వహించడం, జాతీయ స్థాయిలో భారత్ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపాలనేది తన కలగా వెల్లడించారు.

సినిమా రంగంలో అవకాశాలపై ఆసక్తి ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికే పలు ప్రకటనల్లో నటించానని, బాలీవుడ్ లో అవకాశం వస్తే పనిచేయాలని కోరుకుంటున్నానన్నారు. అంతేగాక, జంతువుల సంక్షేమం పట్ల తనకు ఎంతో మక్కువ ఉందన్నారు. తాను స్వంతంగా జంతు ఆసుపత్రి మరియు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అవగాహన పెంచాలనేది తుది లక్ష్యం అని చెప్పారు.

Tags:    

Similar News