Ayodhya Ram Mandir Donation Theft: అయోధ్య రామమందిర విరాళాల చోరీ: అసలు సూత్రధారి అవినాష్ శుక్లా!

అవినాష్ శుక్లా!

Update: 2026-07-09 05:16 GMT

Ayodhya Ram Mandir Donation Theft: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక వ్యక్తి అవినాష్ శుక్లాను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. భక్తులు ఆలయానికి సమర్పించిన నగదు విరాళాలను లెక్కించే బాధ్యతలో భాగంగా ట్రస్టు అతన్ని రూ.15 వేల వేతనంతో నియమించింది.

సిట్ ప్రాథమిక దర్యాప్తులో శుక్లా 70 సార్లు నగదును దారి మళ్లించడంలో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ఈ కేసు మొత్తం శుక్లా చుట్టూ తిరుగుతున్నట్లు, మరిన్ని నిందితులను గుర్తించడానికి మరియు విరాళాల లెక్కింపు కేంద్రంలో జరిగిన అక్రమాలను బయటపెట్టడానికి ఇది ఉపయోగపడిందని సిట్ వర్గాలు తెలిపాయి.

నిందితులైన అనుకల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేలు శుక్లాకు సహకరించినట్లు సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించింది. దర్యాప్తు భాగంగా పోలీసులు శుక్లాను అదుపులోకి తీసుకుని విచారించగా, అతని ఇంట్లో విరాళాల హుండీ లభ్యమైంది. అతని స్వస్థలంలోనూ ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు.

అనుకల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేలను బుధవారం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరు పోలీసు విచారణలో ఫోర్జరీ రశీదులను ఉపయోగించి భక్తుల నుంచి విరాళాలు సేకరించినట్లు అంగీకరించారు. మరో నిందితుడు టిన్నూ యాదవ్‌తో కలిసి ఈ అక్రమాలు చేశారని చెప్పారు. పోలీసులు ఒక పాత నకిలీ రశీదు పుస్తకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News