Mib Banned Pornapps : అభ్యంతరకర కంటెంట్‌ ప్రసారం చేస్తున్న యాప్‌ లపై నిషేధం

26 వెబ్‌ సైట్లు, 14 యాప్‌లపై బ్యాన్‌ విధించిన కేంద్ర సమాచార శాఖ;

Update: 2025-07-25 10:20 GMT

ఆన్‌లైన్‌ లో అభ్యంతరకర కంటెంట్‌ ను నియంత్రించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో ముందడుకు వేసింది. ప్రధానంగా అశ్లీల చిత్రాలను, అసభ్యకరమైన వీడియోలను సర్క్యులేట్‌ చేస్తున్న ఉల్లూ, దేశీఫ్లిక్స్‌, మోజ్‌ఫ్లిక్స్‌, ఏఎల్‌టీటీ వంటి పలు ప్రసిద్ది చెందిన 26 వెబ్‌ సైట్లు, 14 యాప్‌లపై నిషేధం విధిస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈవెబ్‌ సైట్లు, యాప్‌లు పోర్నోగ్రఫీతో పాటు అభ్యంతరకర కంటెంటును ప్రోత్సహిస్తున్న క్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకముందు జాబితాలో పేర్కొన్న 25 ఓటీటీ మాధ్యమాలకు చెందిన 26 వెబ్‌ సైట్లు, 14 యాప్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా లింకులను బ్యాన్‌ చేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఎంఐబీ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి భారతదేశంలో పోర్న్‌ సైట్లపై ఎప్పటి నుంచో నిషేదం ఉంది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కొంత మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. దీనికి తోడు ఈ వ్యవహారంలో భారతదేశంలో కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫాములు తమ యాప్‌ల ద్వారా పోర్న్‌, సాఫ్ట్‌ పోర్నలను ప్రసారాలు చేస్తున్నారు. వీటిలో ఏక్తాకపూర్‌ కి చెందిన బాలాజీ టెలీఫిలిమ్స్‌కు చెందిన ఉల్లు, ఏఎల్‌టీటీల వంటి యాప్‌ లు ప్రముఖంగా ఉన్నాయి. వీరిని చూసి మరింత మంది ఈ తరహా యాప్‌ లను రూపొందించి ఏకంగా పోర్న్‌ కంటెంట్‌ ప్రమోట్‌ చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్రం వీటిపై నిషేధం విధించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000లోని సెక్షన్‌ 67, 67ఏ కింద ఈ యాప్‌ లను నిషేధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Tags:    

Similar News