Rahul Gandhi Alleges: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దేశీయ రైతాంగాన్ని దెబ్బతీస్తుంది - రాహుల్ గాంధీ ఆరోపణ

దేశీయ రైతాంగాన్ని దెబ్బతీస్తుంది - రాహుల్ గాంధీ ఆరోపణ

Update: 2026-03-02 05:36 GMT

Rahul Gandhi Alleges: పంజాబ్‌లోని బర్నాలాలో మజ్దూర్ కిసాన్ మహార్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారత్-అమెరికా మధ్య ఏర్పడిన తాత్కాలిక వాణిజ్య ఒప్పందం దేశీయ రైతాంగాన్ని దెబ్బతీస్తుందని తీవ్రంగా ఆరోపించారు.

ఈ ఒప్పందంలో వ్యవసాయ రంగాన్ని విదేశీ మార్కెట్లకు అనుకూలంగా మార్చే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గత నాలుగు నెలలుగా అది నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. "ప్రధాని నాలుగు నెలలుగా చేయలేని పనిని ఎలా 15 నిమిషాల్లో పూర్తి చేశారు? ఆకస్మికంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమిటి?" అని రాహుల్ ప్రశ్నించారు.

ఏటా అమెరికా నుంచి సుమారు రూ. తొమ్మిది లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుందని ప్రధాని మోదీ ట్రంప్‌కు హామీ ఇచ్చారని, ఇది దేశ రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా లోక్‌సభలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే పుస్తకం గురించి మాట్లాడాలనుకున్నా అవకాశం ఇవ్వలేదని రాహుల్ తెలిపారు.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రత కోసం కేంద్రం వెంటనే ముందస్తు చర్యలు తీసుకోవాలని రాహుల్ ఎక్స్ వేదికగా కేంద్రాన్ని కోరారు.

అలాగే మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం (ECHS)కు తగిన నిధులు కేటాయించడంతో పాటు, వికలాంగుల పెన్షన్లపై పూర్తి ఆదాయపు పన్ను మినహాయింపును పునరుద్ధరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News