West Bengal Chief Minister Mamata Banerjee: ఈసీ రాజ్యాంగ ఔచిత్యాలు అతిక్రమించారని ఆరోపించిన మమతా బెనర్జీ

అతిక్రమించారని ఆరోపించిన మమతా బెనర్జీ

Update: 2026-03-20 11:21 GMT

West Bengal Chief Minister Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరు దిగ్భ్రాంతికరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. గురువారం ఈసీ ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు ఘాటైన పదజాలంతో లేఖ రాశారు.

ఈసీ రాజ్యాంగబద్ధ సభ్యత, ఔచిత్యాలను అతిక్రమించిందని, రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతున్న ఏ అభ్యంతరాన్నీ పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. క్షేత్రస్థాయి వాస్తవాలు, ప్రజల బాగోగులు ఏమాత్రం పట్టకుండా ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు.

ఓటర్ల జాబితాల సవరణ కొనసాగుతున్న తరుణంలో జిల్లా ఎన్నికల అధికారులను బదిలీ చేయడం వెనుక స్పష్టమైన దురుద్దేశాలు కనిపిస్తున్నాయని మమతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు పరోక్షంగా కేంద్ర పాలనను, ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను గుర్తుచేస్తున్నాయని, ఈ నిర్ణయాలను తక్షణమే పునఃసమీక్షించాలని ఆమె కోరారు.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల నేపథ్యంలో ఈసీ చర్యలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా ఇలా తీవ్రంగా స్పందించడం గమనార్హం.

Tags:    

Similar News