Mamata Banerjee Warns Bharatiya Janata Party: బెంగాల్‌ను ధ్వంసం చేయాలని చూస్తే భాజపా దేశంలో అధికారం కోల్పోతుంది: మమతా బెనర్జీ
భాజపా దేశంలో అధికారం కోల్పోతుంది: మమతా బెనర్జీ
ఎన్నికలు గెలిచిన వెంటనే దిల్లీ స్వాధీనం చేసుకుంటా.. అన్ని పార్టీలతో కలిసి ముందుకు
Mamata Banerjee Warns Bharatiya Janata Party: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాపై తీవ్రమైన విమర్శలు చేశారు. ముర్షిదాబాద్‌లో శుక్రవారం రామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “బెంగాల్‌ను ధ్వంసం చేయాలని భాజపా ప్రయత్నం చేస్తే.. దేశవ్యాప్తంగా అధికారం కోల్పోవడం ఖాయం” అని స్పష్టంగా హెచ్చరించారు.
రాణిగంజ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మమతా మరింత మండిపడ్డారు. “త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచిన వెంటనే దిల్లీని స్వాధీనం చేసుకుంటా. దీనికోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ముందుకు వెళ్తా” అని ప్రకటించారు.
భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పక్షంలో ఇళ్లపై బుల్డోజర్లు నడపి, ప్రజలందరినీ బయటకు గెంటేస్తారని మమతా ఆరోపించారు. “తమ గెలుపు కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ భాజపా నేతలు అన్ని హద్దులు దాటుతున్నారు” అని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కూడా భాజపా ఆదేశాల మేరకే రాష్ట్రంలో ఎన్నికల ముందు ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను హడావిడిగా చేపట్టిందని ఆమె ఆరోపించారు.
బెంగాల్‌లో భాజపా వ్యతిరేక ఉద్యమం మరింత బలపడుతుందని, తన పార్టీ తరపున ప్రజల మద్దతుతో పోరాడతానని మమతా బెనర్జీ ఈ సందర్భంగా ప్రకటించారు.