Maoists Call for Bharat Bandh on November 23: హిడ్మా మరణంతో మావోయిస్టుల ఆగ్రహం.. నవంబర్ 23న భారత్ బంద్ పిలుపు!

నవంబర్ 23న భారత్ బంద్ పిలుపు!

Update: 2025-11-21 11:47 GMT

Maoists Call for Bharat Bandh on November 23: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఉన్నత నేత మాద్వి హిడ్మా మరణించిన నేపథ్యంలో సీపీఐ (మావోయిస్టు) పార్టీ నవంబర్ 23న జాతీయస్థాయిలో భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. హిడ్మా మరణాన్ని “రాష్ట్ర పిరికితనం” అని మావోయిస్టులు ఆరోపిస్తూ.. దేశవ్యాప్తంగా బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు, తమ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గత వారం ఛత్తీస్‌గఢ్‌లోని అభుజ్‌మాడ్ అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ బలగాలు నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో మావోయిస్టు పీఎల్‌జీఏ-1 బెటాలియన్ కమాండర్ మాద్వి హిడ్మా (45)తో పాటు మరో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టులు “ఫేక్ ఎన్‌కౌంటర్” అని ఖండిస్తూ.. హిడ్మా గెరిల్లా యుద్ధంలో అమరుడయ్యాడని ప్రకటించారు.

దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తరపున విడుదల చేసిన ప్రకటనలో.. “హిడ్మా మరణం మావోయిస్టు ఉద్యమానికి తీరని నష్టం. ఈ దాడిని ప్రతీకారంగా తీర్చుకుంటాం” అని హెచ్చరించారు. నవంబర్ 23 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్త బంద్ పాటించాలని, రవాణా, వ్యాపార సంస్థలు మూసివేయాలని పిలుపునిచ్చారు.

ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఒడిషా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో భద్రతా బలగాలు అప్రమతమయ్యాయి. రహదారులు, రైల్వే ట్రాక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా అధికారులు అంచనా వేస్తున్నారు. మావోయిస్టులు బంద్ సందర్భంగా బస్సులు, ట్రక్కులు ఆపేయడం, రోడ్లు బంద్ చేయడం, పోస్టర్లు అంటించడం వంటి కార్యక్రమాలు చేపట్టవచ్చని ఇంటెలిజెన్స్ నివేదికలు తెలిపాయి.

Tags:    

Similar News