Marriage Advice for Rahul Gandhi: రాహుల్ గాంధీకి పెళ్లి సలహా: త్వరగా వివాహం చేసుకోండి.. స్వీట్స్ ఆర్డర్ మాకే ఇవ్వండి అన్న ఢిల్లీ స్వీట్ షాప్ యజమాని!

స్వీట్స్ ఆర్డర్ మాకే ఇవ్వండి అన్న ఢిల్లీ స్వీట్ షాప్ యజమాని!

Update: 2025-10-21 11:04 GMT

Marriage Advice for Rahul Gandhi: భారత రాజకీయాల్లో అత్యంత అర్హత కలిగిన బ్యాచిలర్లలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒకరు. ఆయన ప్రజల మధ్యకు వెళ్లినప్పుడల్లా, ఎవరో ఒకరు పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తూనే ఉంటారు. తాజాగా, దీపావళి పర్వదినం సందర్భంగా ఓల్డ్ ఢిల్లీలోని ప్రసిద్ధ స్వీట్ షాపును సందర్శించిన సమయంలో కూడా రాహుల్ పెళ్లి విషయం చర్చకు వచ్చింది.

ఘంటేవాలా స్వీట్ షాప్ యజమాని సుశాంత్ జైన్‌తో రాహుల్ గాంధీ సరదాగా సంభాషించారు. వ్యాపారం ఎలా సాగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో, రాహుల్ త్వరగా పెళ్లి చేసుకోవాలని స్వీట్ షాప్ యజమాని సూచించడం ఆసక్తికరం. అంతేకాకుండా, ఆ వివాహంలో స్వీట్స్ ఆర్డర్లు తమ షాపుకే ఇవ్వాలని కోరడం విశేషం.

ఓల్డ్ ఢిల్లీలోని ప్రఖ్యాత ఘంటేవాలా స్వీట్ షాపులో ఇమార్తి, బేసన్ లడ్డూ వంటివి తయారు చేసే ప్రక్రియను ప్రయత్నించానని, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ షాపు మధురత్వం ఇప్పటికీ అలాగే ఉందని రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ స్వీట్ షాప్ యజమానికి రాహుల్ కుటుంబంతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా తమ షాపులో తయారైన స్వీట్లను ఎంతో ఇష్టపడేవారని యజమాని తెలిపారు. దీపావళికి టపాసులు ఎంత ప్రసిద్ధమో, స్వీట్లు కూడా అంతే ప్రాచుర్యం పొందాయి. నోట్లో పడగానే కరిగిపోయే ఈ స్వీట్లు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రియమైనవి.

Tags:    

Similar News