Poonam Kaur : సుధామూర్తి ధరించే చేనేత చీరలు ఆమె వ్యక్తిత్వానికి ప్రతిబింబాలు
రతన్ టాటా చేనేత పోర్ట్రెయిట్‌ను సుధా మూర్తికి బహుకరించిన పూనమ్ కౌమ్;
చేనేత చీరలు సాధికారతకు చిహ్నాలని సినీ నటి, ప్రముఖ హ్యాండ్లూమ్ ప్రమోటర్ పూనమ్ కౌర్ అభిప్రాయపడ్డారు. చేనేత దినోత్సవం సందర్భంగా బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సుధామూర్తిని ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ సుధా మూర్తి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు. ఎల్లప్పుడూ చేనేత చీరలను మాత్రమే కట్టుకునే సుధామూర్తి వ్యక్తిత్వం ఆ చీరలోనే ప్రస్పుటమవుతుందని అన్నారు. బెంగళూరులోని భారతీయ విజ్ఞాన శాస్త్ర సంస్ధలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నసుధామూర్తి జీవితాన్ని ఒక ఉద్యోగ ప్రకటన మలుపుతిప్పిందని పూనమ్ గుర్తు చేశారు. టెల్కో నుంచి ఈ ప్రకటనలో మహిళా అభ్యర్ధులు దరఖాస్తు చేయవద్దనే షరతును చూసిన సుధామూర్తి జేఆర్‌డీ టాటాకు ఇది న్యాయం కాదని ధైర్యంగా లేఖరాసి ఉద్యోగం సాధించారని కొనియాడారు. సుధామూర్తిలోని ఈ తిరుగుబాటు గుణానికి ఆమో ధరించే చేనేత వస్త్రాలు వన్నె తెచ్చాయన్నారు. ఇన్ఫోసిస్ స్ధాపన సమయంలో టెల్కోను వీడుతున్నప్పుడు జేఆర్‌డీటాటా చెప్పిన నాలుగు హిత వాక్యాలను ఇప్పటికీ సుధా మూర్తి తూచ తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. విజయం అంటే సమాజానికి తిరిగి ఇవ్వడం… సమాజం మనకి చాలా ఇస్తుంది మనం దానికి తిరిగి ఇవ్వాలని అని జేఆర్‌డీ చెప్పిన మాటలు సుధామూర్తి జీవన శైలిని నిర్ధేశించాయన్నారు. ఆనాటి నుంచి నేత చీరలు ధరించి అతి సామాన్య జీవితం లీడ్ చేస్తున్న సుధామూర్తి సమాజ సేవలో ముందుంటారని చెప్పారు. చేనేత చారలు స్త్రీ శక్తిని చాటి చెపుతాయని అన్నారు. ఈ సందర్భంగా చేనేతతో తయారు చేసిన రతన్ టాటా పోర్ట్రెయిట్‌ను సుధామూర్తికి బహుమతిగా అందజేశారు పూనమ్‌కౌర్.