Karnataka CM’s Official Car: కర్ణాటక సీఎం అధికారిక కారుకు ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై జరిమానా.. 50% డిస్కౌంట్‌తో చెల్లింపు

50% డిస్కౌంట్‌తో చెల్లింపు

Update: 2025-09-06 11:32 GMT

Karnataka CM’s Official Car: కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్‌ చలానాలపై వాహనదారులకు 50 శాతం డిస్కౌంట్‌ స్కీమ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రయాణించే కారుపై విధించిన జరిమానాను కూడా చెల్లించారు. సీఎం కారుపై మొత్తం ఏడు ట్రాఫిక్‌ ఉల్లంఘనలు నమోదయ్యాయి. వీటిలో ఆరుసార్లు సీటు బెల్ట్‌ ధరించనందుకు, ఒకసారి అతివేగం కారణంగా చలానా పడింది.

సీఎం కారుపై జరిమానా ఉన్నప్పటికీ చెల్లించలేదని సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చర్చ జరిగింది. దీంతో సీఎం యంత్రాంగం ఈ డిస్కౌంట్‌ పథకాన్ని ఉపయోగించి రూ.8750 జరిమానా చెల్లించింది. ఈ స్కీమ్‌ కింద జరిమానా సగం చెల్లిస్తే మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 21న ప్రారంభమైన ఈ పథకం సెప్టెంబరు 19 వరకు అమల్లో ఉంటుంది. ఈ రాయితీ ద్వారా ఇప్పటివరకు రూ.40 కోట్లు వసూలైనట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు.

Tags:    

Similar News