విమానం కూలిన భయంతో బాల్కనీ నుంచి దూకిన విద్యార్థులు వీడియో వైరల్‌

Video of students jumping from balcony fearing plane crash goes viral

Update: 2025-06-17 10:32 GMT

గుజరాత్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీజే మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ భవనంపై కుప్పకూలిన ఘటన మరువకముందే.. ఇప్పుడు దానికి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది.



అపాయంగా మారిన ఆ క్షణాల్లో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు ప్రాణాలు రక్షించుకునేందుకు కిందకు దూకే దృశ్యాలు ఆ వీడియోలో రికార్డ్‌ అయ్యాయి. రెండు, మూడు అంతస్తుల బాల్కనీల నుంచి కొంతమంది విద్యార్థులు బెడ్‌షీట్లు, తాళ్ల సాయంతో భవనం కిందకు జారిపడ్డారు. ఒకవైపు మంటలు చెలరేగుతున్నా, మరోవైపు వాళ్లు ఎలా కిందకు దూకుతున్నారో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం సోషల్‌మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతోంది.



జూన్‌ 12వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే భవనంపై విమానం కూలడంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు, సిబ్బంది సహా 33 మంది మరణించారు. ఘటన జరుగుతున్న సమయంలో విద్యార్థులందరూ భోజనం చేస్తుండటం వల్లే ప్రాణ నష్టం అధికమైంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.




Tags:    

Similar News